పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

పోలీసు అధికారులు సేవలు సమకూర్చు వారు మరియు మేజస్ట్రేటుల కర్తవ్యములు. ' 5.గృహ హింసను గురించి ఫిర్యాదును అందుకొనిన లేక ఇతర విధముగా గృహ హింస జరిగిన ప్రదేశమునకు హాజరయిన లేదా గృహ హింస సంఘటన గురించిన సమాచారము అతనికి అందిన ఎవరేని పోలీసు అధికారి, రక్షణ అధికారి సేవలు సమకూర్చు వారు లేక మేజిస్ట్రేటు వ్యధిత వ్యక్తికి ఈ క్రింది విషయాలను, ---

(ఎ) ఈ చట్టము క్రింద రక్షణ ఉత్తరువు, ఆర్థిక సహాయ ఉత్తర్వు, అభిరక్షణ ఉత్తర్వు, నివాస ఉత్తర్వు, నష్ట పరిహార ఉత్తర్వు లేదా ఒకటి లేక అంతకన్నా ఎక్కువ ఉత్తర్వుల ద్వారా పరిహారము పొందు నిమిత్తము దరఖాస్తు చేసుకొను హక్కు ఆమెకు కలదని;

(బి) సేవలు సమకూర్చు వారి సేవలను పొందుటకు అవకాశమున్నదని;

(సి) రక్షణ అధికారుల సేవలను పొందుటకు అవకాశమున్నదని;

1987లోని 39వచట్టము.

(డి) న్యాయ సేవల ప్రాధికారములు చట్టము, 1987 క్రింద ఉచిత న్యాయమును పొందుటకు హక్కు ఉన్నదని;

1960 లోని 45 వ చట్టము.

(ఇ) సందర్భమును బట్టి భారతీయ శిక్షాస్మృతిలోని 498-ఎ పరిచ్ఛేదము క్రింద ఫిర్యాదును దాఖలు చేసే హక్కు ఆమెకు ఉన్నదన్న విషయాన్ని: తెలియజేయవలెను.

అయితే, సంజేయమైన అపరాధము జరిగినదను సమాచారము అందుకొన్న పోలీసు అధికారిని చట్ట ప్రకారము చర్య తీసుకొనవలసిన బాధ్యత నుండి ఏ విధముగానైనను అతనిని విముక్తుని చేయునదిగా అన్వయించుకోరాదు.

6. వ్యధితవ్యక్తి లేక ఆమె తరఫున రక్షణ అధికారి లేదా సేవలు సమకూర్చువారు ఆమెకు ఆశ్రయము కల్పించవలసినదిగా ఆశ్రయ గృహము యొక్క ఇన్ ఛార్జి అధికారిని కోరినచో ఆశ్రయ గృహము యొక్క అట్టి ఇన్ ఛార్జి అధికారి ఆశ్రయ గృహములో వ్యధిత వ్యక్తికి ఆశ్రయమును ఏర్పాటు చేయవలెను.

ఆశ్రమ గృహముల కర్తవ్యము.

7. వ్యధితవ్యక్తి లేక ఆమె తరఫున రక్షణ అధికారి లేదా సేవలు సమకూర్చువారు ఆమెకు వైద్యపరమైన సహాయమును ఏర్పాటు చేయవలసినదిగా వైద్య సదుపాయముల ఇన్ ఛార్జి అధికారిని కోరినప్పుడు అట్టి ఇన్ ఛార్జి అధికారి ఆమెకు వైద్యపరమైన సహాయమును ఏర్పాటు చేయవలెను.

రక్షణ అధికారుల నియామకము.

8.(1) రాజ్య ప్రభుత్వము అధిసూచన ద్వారా ప్రతి జిల్లాలోను తాను అవసరమని భావించనంత మంది రక్షణ అధికారులను నియమించవలెను; మరియు ఈ చట్టముచే లేక దాని క్రింద వారు వినియోగించదగిన అధికారములను మరియు నిర్వర్తించవలసిన కర్తవ్య ముల యొక్క ప్రాంతము లేక ప్రాంతములను కూడ అధిసూచించవలెను.