పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/4

ఈ పుట ఆమోదించబడ్డది

(ఇ) “గృహ సంఘటనా నివేదిక' అనగా వ్యధితవ్యక్తి నుండి గృహ హింసకు సంబంధించి అందిన ఫిర్యాదుపై, విహితపరచబడిన ప్రరూపములో తయారు చేయబడిన నివేదిక అని అర్థము;

(ఎఫ్) “గృహ సంబంధ బంధుత్వము” అనగా ఏదో ఒక సమయంలో ఒకే కుటుంబంలో కలసి జీవించిన లేక జీవిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్యగల బంధుత్వము అని అర్థము, ఆ బంధుత్వము రక్తసంబంధమైనది కావచ్చు, వైవాహికమైనది కావచ్చు లేక వైవాహిక సంబంధమును పోలినదైనను కావచ్చు, దత్తత వలన ఏర్పడినది లేక ఉమ్మడి కుటుంబ సభ్యుల మధ్యన ఉన్నది అయిన బంధుత్వము కావచ్చును;

(జి) “గృహ హింస" అను పదమునకు 3వ పరిచ్చేదములో ఒసగబడిన అర్థమునే కలిగియుండును;

1961 లోని 28 చట్టము (హెచ్) "వరకట్నము" అనే పదము వరకట్న నిషేధ చట్టము, 1961 యొక్క 2వ పరిచ్ఛేదములో ఈయబడిన అర్థమే ఉండును;

1974 లోని 2 వ చట్టము (ఐ). "మేజిస్ట్రేటు” అనగా వ్యధితురాలైన స్త్రీ తాత్కాలికముగా లేక ఇతరవిధంగా నివసించు ప్రదేశములో లేక ప్రతివాది నివసించు ప్రదేశములో లేదా గృహహింస జరిగిన ప్రదేశములో అమల్లోవున్న క్రిమినలు ప్రకియా స్మృతి, 1973 క్రింద అధికారితా పరిధిని వినియోగించుచున్న మొదటి తరగతి న్యాయిక మేజిస్ట్రేటు లేక సందర్భానుసారము మహానగర మేజిస్ట్రేటు అని అర్థము;

(జె) "వైద్య సదుపాయం” అనగా ఈ చట్ట ప్రయోజనములకై రాజ్య ప్రభుత్వముచే అధి సూచింపబడినట్టి వైద్య సదుపాయము అని అర్థము;

(కె) "ఆర్థిక సహాయము" అనగా ఈ చట్టము క్రింద నష్టపరిహారము కోరుచు అభ్యర్థించిన వ్యధిత వ్యక్తి దరఖాస్తు పై ఆకర్ణనము జరుగు ఏదేని సమయములోగాని, లేదా గృహ హింసకు గురైన వ్యధిత వ్యక్తి ఖర్చు చేసిన మరియు నష్టపోయిన ఇతర ఖర్చుల నిమిత్తముగాని మేజిస్ట్రేటు ప్రతివాదికి ఉత్తరువు జారీచేయుట ద్వారా చెల్లించమని ఆదేశించు నష్టపరిహారము అని అర్థము;

(ఎల్) "అధిసూచన" అనగా అధికారిక రాజపత్రములో ప్రచురించబడిన అధి సూచన అని అర్థము, మరియు అధి సూచింపబడిన అను పదబంధమును తదనుసారముగ అన్వయించుకొనవలెను;

(ఎమ్) “విహితపరచిన" అనగా ఈ చట్టము క్రింద చేయబడిన నియమములచే విహితపరచబడు అని అర్థము;