పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

రక్షణ అధికారిచే చేసిన అపరాధమును సంజేయము చేయుట.

34.రాజ్య ప్రభుత్వము లేక దానిచే ఈ విషయములో ప్రాధికారమీయబడిన ఎవరేని అధికారి యొక్క పూర్వానుమోదముతో ఫిర్యాదును దాఖలు చేసిననే తప్ప రక్షణ అధికారి పై ఎట్టి దావా, లేక ఇతర శాసనిక ప్రొసీడింగులు ఉండవు.

సద్భావముతో చేసిన చర్యకు రక్షణ.

35. ఈ చట్టము క్రింద లేక దాని క్రింద చేయబడిన ఏదేని నియమము లేక ఉత్తర్వు క్రింద సద్భావముతో చేసిన లేక చేయుటకు ఉద్దేశించిన దేనివలననైనను కలిgiన లేదా కలుగబోవు ఏదేని చెరుపునకు రక్షణ అధికారి పై ఎట్టి దావా లేక ఇతర శాసనిక ప్రొసీడింగులు ఉండవు.

చట్టము ఏదేని ఇతర శాపనమును మ్యాన పరచకుండుట.

36. ఈ చట్టము యొక్క నిబంధనలు, తత్సమయమన అమలునందున్న ఏదేని ఇతర శాసనములోని నిబంధనలకు అదనముగా ఉండునేగాని, వాటిని న్యూనపరచునవిగా ఉండవు.

నియమములు చేయుటకు కేంద్ర ప్రభుత్వమునకు అధికారము.

37.(1) ఈ చట్టము యొక్క నిబంధనలను అమలుపరచుటకు కేంద్రప్రభుత్వము అధి సూచన ద్వారా నియమములను చేయవచ్చును.

(2) ప్రత్యేకించియు, పైన పేర్కొనబడిన అధికారముల యొక్క సాధారణతకు భంగము లేకుండాను అట్టి నియమములను ఈ క్రింద అన్ని లేక ఏవేని విషయములను చేయవచ్చును, అవేవనగా:-

(ఎ) 8వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద రక్షణ అధికారి కలిగియుండ వలసిన అర్హతలు మరియు అనుభవము;

(బి) 8వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (3) క్రింద రక్షణ అధికారుల మరియు అతని అధీనస్థ ఇతర అధికారుల సేవా నిబంధనలు మరియు షరతులు;

(సి) 9వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (బి) క్రింద గృహ సంఘటన నివేదికను తయారు చేయవలసిన ప్రరూపము మరియు రీతి;

(డి) 9వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (సీ) క్రింద మేజిస్ట్రేటుకు రక్షణ ఉత్తర్వు కొరకు దరఖాస్తు ప్రరూపము మరియు రీతి;

(ఇ) 9వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (డి) క్రింద ఫిర్యాదును దాఖలు చేయు ప్రరూపము;

(ఎఫ్) 9వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) యొక్క ఖండము (ఐ) క్రింద రక్షణ అధికారిచే నిర్వర్తించవలసిన ఇతర కర్తవ్యములు;