పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/2

ఈ పుట ఆమోదించబడ్డది

శాసన మరియు న్యాయపాలన మంత్రిత్వ శాఖ

(శాసన నిర్మాణ విభాగము)

ఈ క్రింది చట్టములు, అనగా,

(1) వర్ణ వివక్ష వ్యతిరేక (ఐక్య రాజ్యసమితి ఒడంబడిక) చట్టము, 1981(1981లోని 48వ చట్టము) (2) విమాన అపహరణ వ్యతిరేక చట్టము, 1982 (1982లోని 65వ చట్టము) (3) మానవ హక్కుల రక్షణ చట్టము, 1993 (1994లోని 10వ చట్టము) (4) సముద్ర తీర నీటి ప్రాణుల పెంపకపు ప్రాధికార చట్టము, 2005 (2005లోని 24వ చట్టము) (5) గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005 (2005లోని 43వ చట్టము) మరియు (6) అనుసూచిత జనజాతుల మరియు ఇతర పరంపరానుగత అటవీ నివాసితుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టము, 2006 (2007లోని 2వ చట్టము)ల యొక్క తెలుగు అనువాదములను రాష్ట్రపతి ప్రాధికారము క్రింద ఇందుమూలముగా ప్రచురించడమైనది. చట్టములకు గల ఈ అనువాదములను ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము 1973 (1973లోని 50వ చట్టము) యొక్క 2వ పరిచ్ఛేదములోని ఖండము (ఏ) క్రింద, ప్రాధికృత తెలుగు పాఠములైనట్లు భావించవలెను.