పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయము - 5

వివిధ విషయములు

రక్షణ అధికారులు మరియు సేవలు సమకూర్చువారి సభ్యులు పబ్లిక్ సేవకులుగా ఉండుట.1860లోని 45వ చట్టము

30. ఈ చట్టము యొక్క నిబంధనలు లేక ఏవేని నియమములు లేక దాని క్రింద చేయబడిన ఏవేని ఉత్తర్వుల ననుసరించి రక్షణ అధికారులు మరియు సేవలు సమకూర్చు వారి సభ్యులు తమ విధి నిర్వహణ లేక నిర్వహణకు ఉద్దేశించిన పనులను నిర్వహించుటలో భారత శిక్షా స్మృతి యొక్క 21వ పరిచ్ఛేదపు అర్థములో పబ్లిక్ సేవకుడుగా భావించబడవలెను.

ప్రతివాదిచే రక్షణ ఉత్తర్వును ఉల్లంఘించినందుకు జరిమానా,

31.(1) ప్రతివాది రక్షణ ఉత్తర్వు లేక మధ్యకాలిన రక్షణ ఉత్తర్వును ఉల్లంఘించుట ఈ చట్టము క్రింద అపరాధముగా భావించబడి అతడు ఒక సంవత్సర కాలము వరకు ఉండగల కాలావధికి ఏదేని రకపు కారావాసముతోనైనను లేదా ఇరువది వేల రూపాయల వరకు ఉండగల జరిమానాతోనైను లేక ఈ రెండింటితోనైనను శిక్షింపబడును.

(2) నిందితునిచే ఉల్లంఘించబడినదిగా ఆరోపించబడినట్టి ఉప-పరిచ్ఛేదము(1) క్రింద అపరాధ ఉత్తర్వు, దానిని జారీచేసిన మేజిస్ట్రేటుచే సాధ్యమయినంత వరకు విచారించబడవలెను.

1860లోని 45వ చట్టము. 1961లోని 28వ చట్టము.

(3) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ఆరోపణలను రూపొందించునపుడు మేజిస్ట్రేటు భారత శిక్షా స్మృతిలోని 498-ఏ లేక ఆ స్మృతి యొక్క ఏదేని ఇతర నిబంధనలు లేక సందర్భానుసారముగా వరకట్న నిషేధ చట్టము, 1961లోని నిబంధనల క్రింద అపరాధము జరిగినదని వెల్లడించ సంగతులు ఉంటే ఆ నిబంధనల క్రింద కూడ ఆరోపణలను రూపొందించవచ్చును.


32.(1) భారత శిక్షా స్మృతి, 1973లో ఏమున్నప్పటికినీ, 31వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద అపరాధము సంజేయమైనది మరియు జామీను ఇవ్వలేనట్టి అపరాధమగును.

సంజేయము మరియు రుజువు. 1974లోని 2వ చట్టము.

(2) వ్యధితవ్యక్తి ఇచ్చిన ఏకైక సాక్ష్యం పై ఆధారపడి న్యాయస్థానము 31వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము - (1) క్రింద నిందితుడు అపరాధము చేసినట్లు న్యాయస్థానము నిర్ణయమునకు రావచ్చును.

రక్షణ అధికారి తన కర్తవ్యము నిర్వహించనందుకు జరిమానా,

33. మేజిస్ట్రేటుచే రక్షణ ఉత్తర్వులో ఆదేశించబడిన విధంగా తగువిధమైన కారణము లేకుండా తన కర్తవ్యమును నిర్వర్తించుటకు తిరస్కరించిన లేక విఫలుడైన ఎవరేని రక్షణ అధికారి ఒక సంవత్సర కాలమువరకు ఉండగల కాలవధికి ఏ రకపు కారావాసముతో నైనను, లేక ఇరువదివేల రూపాయల వరకు ఉండగల జరిమానాతో నైనను లేక రెండింటితో నైనను శిక్షింపబడదగియుండును.