పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/17

ఈ పుట ఆమోదించబడ్డది

అయితే, ఏదేని అట్టి ప్రతివాది సందర్శన, బిడ్డ లేక బిడ్డల హితమునకు హానికరమని మేజిస్ట్రేటు భావించినచో, అట్టి సందర్శనకు అనుమతించుటను నిరాకరించవచ్చును.

నష్ట పరిహారపు ఉత్తర్వులు,

22. ఈ చట్టము క్రింద మంజూరు చేయబడునట్టి పరిహారములకు అదనంగా, మేజిస్ట్రేటు వ్యధిత వ్యక్తి. చేసుకున్న దరఖాస్తు పై ప్రతివాది పాల్పడిన గృహ హింస కృత్యముల వలన కలిగిన మానసిన యాతన, భావ ధ్వేగయాతనతో సహా కలిగిన గాయములకు నష్టపరిహారము లేక నష్ట పూర్తి (డ్యామేజీలు) చెల్లించవలసిందిగా ప్రతివాదిని ఆదేశిస్తూ ఉత్తర్వును చేయవచ్చును.

మధ్యకాలిక మరియు ఏకపక్షీయ ఉత్తర్వులు మంజూరు చేయుటకు అధికారము.

23.(1) ఈచట్టము క్రింద మేజిస్ట్రేటు ఆయన ముందున్న ఏదేని ప్రొసీడింగులో తాను న్యాయమని, యుక్తమని భావించినట్టి మధ్యంతర ఉత్తర్వును జారీ చేయవచ్చును.

(2) మేజిస్ట్రేటు దరఖాస్తును ప్రధమ దృష్ట్యా చూచినంతనే ప్రతివాది గృహహింస కృత్యమునకు పాల్పడినాడని లేక పాల్పడుచున్నాడని, లేక పాల్పడవచ్చునని రూఢిగా విశ్వసించినపుడు 18వ పరిచ్ఛేదము, 19వ పరిచ్ఛేదము, 20వ పరిచ్ఛేదము, 21వ పరిచ్ఛేదము లేక సందర్భానుసారము 22వ పరిచ్ఛేదము క్రింద వ్యధిత వ్యక్తి యొక్క ప్రమాణ పత్రం ఆధారంగా విహితపరచినట్టి ప్రరూపములో ప్రతివాదిపై ఏకపక్షీయ ఉత్తర్వును మంజూరు చేయవచ్చును.

ఉత్తర్వుల ప్రతులను న్యాయస్థానము ఉచితముగా ఇచ్చుట.

24. మేజిస్ట్రేటు, ఈ చట్టము క్రింద అన్ని కేసులలో తాను ఇచ్చిన ఏదేని ఉత్తర్వులకు సంబంధించి అట్టి ఉత్తర్వు ప్రతిని దరఖాస్తు యొక్క పక్షకారులకు, మేజిస్ట్రేటును కోరిన స్థానిక ప్రాంతపు అధికారితా పరిధిలో ఉన్న పోలీసు స్టేషను యొక్క ఇన్ ఛార్జీ పోలీసు అధికారికి, మరియు న్యాయస్థానపు అధికారితా పరిధిలోని స్థానిక ప్రాంతపు అధికారితా పరిధిలోవున్న సేవలు సమకూర్చువారు మరియు గృహ సంఘటన నివేదికను నమోదు చేసిన ఏదేని సేవలు సమకూర్చువారు ఉన్నచో దానికి ఉచితముగా ఇవ్వవలెను.

ఉత్తర్వుల మార్పు మరియు కాలావధి.

25.(1) 18వ పరిచ్ఛేదము క్రింద చేసిన రక్షణ ఉత్తర్వు వ్యధిత వ్యక్తి దానిని ఉన్ముక్తత చేయమని దరఖాస్తు చేయునంతవరకు అమలులోనుండును.

(2) మేజిస్ట్రేటు వ్యధిత వ్యక్తి నుండి లేక ప్రతివాది నుండి దరఖాస్తు అందిన మీదట ఈ చట్టము క్రింద చేయబడిన ఏదేని ఉత్తర్వుకు మార్పు, సవరణ లేక ఉపసంహరణకు అవసరమైన పరిస్థితులు ఏర్పడినవని సంతృప్తి చెందినచో దానికి గల కారణములను రికార్డు చేసి తాను సబబని భావించినట్టి ఉత్తర్వును జారీ చేయవచ్చును.

ఇతర దావా మరియు శాసనిక కార్యకలాపాలలో పరిహారము.

26 (1) వ్యధిత వ్యక్తిని మరియు ప్రతివాదిని ప్రభావితము చేయు అట్టి ప్రొసీడింగులను ఈ చట్టము ప్రారంభమునకు పూర్వము లేక తరువాత ప్రారంభించననూ, లేకున్నను 18, 19, 20, 21, మరియు 22వ పరిచ్ఛేదము క్రింద లభించు ఏదేని పరిహారము సివిల్