పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది

1974లోని 2వ చట్టము.

(సి) వ్యధిత వ్యక్తి నియంత్రణలోనున్న ఏదేని ఆస్తిని ధ్వంసము చేసినందు వలన, నష్ట పరిచినందువలన లేక ఆమె అధీనము నుండి తొలగించినందు వలన ఆమెకు కలిగిన నష్టము; మరియు

1974లోని 2వ చట్టము.

(డి) క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 125వ పరిచ్ఛేదము క్రింద లేక తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనం క్రింద మనోవర్తి ఉత్తర్వు క్రింద లేదా దానికి అదనంగా వ్యధితవ్యక్తికి మరియు ఆమె బిడ్డకు మనోవర్తి ఏదైనా ఇచ్చివుంటే ఆ మనోవర్తి.

(2) ఈ పరిచ్ఛేదము క్రింద మంజూరు చేయు ధన పరిహారము చాలినంతగా, సముచితంగా, సబబైన మరియు వ్యధిత వ్యక్తి అలవాటుపడిన జీవన విధానమునకు అనుగుణమైనదిగా ఉండవలెను.

(3) కేసు స్వభావము మరియు పరిస్థితులను బట్టి మేజిస్ట్రేటు మనోవర్తి ఏక మొత్తముగాగాని లేదా నెలవారీగా గాని చెల్లింపు చేయవలసిందిగా ఉత్తర్వునిచ్చుటకు అధికారము కలిగివుండవలెను.

(4) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ధనపరిహారము కొరకు ఇచ్చిన ఉత్తర్వు ప్రతినొక దానిని మేజిస్ట్రేటు ప్రతివాది నివసించు స్థానిక ప్రాంతము యొక్క అధికారితా పరిధి కలగిన పోలీసు స్టేషనుకు, మరియు దరఖాస్తు చేసిన పక్షకారులకు పంపవలెను.

(5) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద మంజూరు చేసిన ధన పరిహారమును ఉత్తర్వులో నిర్దిష్టపరచిన సమయము లోపల ప్రతివాది వ్యధిత వ్యక్తికి చెల్లించవలెను.

(6) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద చేయబడిన ఉత్తర్వు ననుసరించి చెల్లింపు చేయుటలో ప్రతివాది విఫలుడైన మీదట మేజిస్ట్రేటు వ్యధితవ్యక్తికి నేరుగా చెల్లించమని లేక ప్రతివాది జీతము లేక వేతనము లేక అతనికి రావలసిన బాకీ లేక ఖాతాకు జమఅయిన మొత్తములోని భాగమును న్యాయస్థానములో డిపాజిటు చేయవలసినదిగా ప్రతివాది యొక్క యజమాని లేక అతని ఋణగ్రస్తుని ఆదేశించవచ్చును మరియు ఆ మొత్తమును ప్రతివాది చెల్లించవలసిన ధన పరిహారము క్రింద సర్దుబాటు చేయవచ్చును.

అభిరక్ష ఉత్తర్వులు.

21.తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో ఏమున్నప్పటికిని మేజిస్ట్రేటు రక్షణ ఉత్తర్వుల కొరకు లేదా ఈ చట్టము క్రింది ఏదేని ఇతర పరిహారము కొరకు చేసిన దరఖాస్తును ఆకర్ణించు ఏ దశలోనైనను, వ్యధిత వ్యక్తి ఎవరేని బిడ్డ లేదా బిడ్డల అభిరక్షను తాత్కాలికముగా ఆమెకు లేక ఆమె తరఫున దరఖాస్తు చేసిన వ్యక్తికి అప్పగించుటకు అనుమతి నీయవచ్చును. మరియు అవసరమైనచో అట్టి బిడ్డ లేదా బిడ్డలను సందర్శించుటకు ప్రతివాదికి అవకాశములను ఇచ్చు ఏర్పాట్లు చేయవలసిందిగా నిర్దేశించవచ్చును.