పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది

1908లోని 5వ చట్టము.

అయితే వ్యధిత వ్యక్తికి అనుకూలంగా ఏదేని న్యాయస్థానము నష్టపరిహారము లేక చెరుపు క్రింద ఏదైనా మొత్తమునకు డిగ్రీని ఇచ్చినపుడు ఈ చట్టము క్రింద మేజిస్ట్రేటుచే చేయబడిన ఉత్తర్వును అనుసరించి చెల్లించిన లేక చెల్లించవలసిన మొత్తము ఏదైనా ఉన్నచో, దానిని అట్టి డిక్రీ క్రింద చెల్లించవలసిన మొత్తములో సర్దుబాటు చేయవలెను మరియు సదరు డిక్రీ సివిల్ ప్రక్రియా స్మృతి, 1908లో లేక తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనములో ఏమున్నప్పటికినీ సర్దుబాటు తరువాత ఏదైనా మిగిలివున్నచో మిగిలిఉన్న ఆ మొత్తం పై అమలుజరుపదగినదై ఉండవలెను.

(3) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద ప్రతి దరఖాస్తు విహితపరచబడినట్టి వివరములను కలిగియుండవలెను మరియు అట్టి ప్రరూపములో లేక సాధ్యమయినంత వరకు దానికి దరిదాపుగా ఉండవలెను.

(4) న్యాయస్థానమునకు దరఖాస్తు అందిన తేదీ నుండి సాధారణముగా మూడు దినములకు మించని కాలావధిలో మేజిస్ట్రేటు మొదటి ఆకర్జన తేదీని నిర్ధారించవలెను.

(5) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద చేయబడిన ప్రతి దరఖాస్తును మొదటి ఆకర్ణన తేదీ నుండి అరువది దినముల లోపుగా పరిష్కారమగునట్లు మేజిస్ట్రేటు ప్రయత్నము చేయవలెను.

నోటీసును తామీలు చేయుట.

13.(1) 12వ పరిచ్ఛేదము క్రింద నిర్ధారించబడిన ఆకర్ణన తేదీ యొక్క నోటీసుకు మేజిస్ట్రేటు రక్షణ అధికారికి ఇవ్వవలెను, రక్షణ అధికారి మేజిస్ట్రేటు నుండి నోటీసు అందిన తేదీ నుండి గరిష్టముగా రెండు దినముల లోపుగా లేక మేజిస్ట్రేటుచే అనుమతించబడినట్టి సబబైన గడువులోపు ప్రతివాదికి లేక మేజిస్ట్రేటుచే ఆదేశించబడిన ఎవరేని ఇతర వ్యక్తికి విహితపరచబడునట్టి పద్ధతుల ద్వారా తామీలు చేయవలెను.

(2) రక్షణ అధికారి విహితపరచబడినట్టి ప్రరూపంలో నోటీసును ప్రతివాదికి లేదా మేజిస్ట్రేటు ఆదేశించినట్టి ఎవరేని ఇతర వ్యక్తికి తామీలు చేసినారని చేసిన అధిప్రఖ్యానము ఇందుకు విరుద్ధముగా నిరూపించబడిననే తప్ప అట్టి నోటీసు తామీలు చేయబడినదనుటకు సాక్ష్యముగా ఉండవలెను.

కౌన్సిలింగ్

14.(1) ఈ చట్టము క్రింద ప్రొసీడింగులలోని ఏదేని దశలో ప్రతివాదిని లేక వ్యధిత వ్యక్తిని, ఒకరిగా లేక సంయుక్తంగా విహితపరచబడినట్లుగా అర్హతలు మరియు అనుభవము గలిగిన సేవలు సమకూర్చువారి యొక్క ఎవరేని సభ్యుని వద్దకు సలహాలు పొందుటకు వెళ్లమని మేజి స్ట్రేటు ఆదేశించవచ్చును.