పుట:గృహహింస నుండి మహిళల రక్షణ చట్టము, 2005.pdf/10

ఈ పుట ఆమోదించబడ్డది

B 8/G61

1974లోని2వ చట్టము.

(హెచ్) 20వ పరిచ్ఛేదము క్రింద ధన పరిహారము కొరకైన ఉత్తరువును క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 క్రింద విహితపరచబడిన ప్రక్రియను అనుసరించి రూపొందించబడి అమలుపరచబడునట్లు చూడవలెను;

(ఐ) విహితపరచబడినట్టి ఇతర కర్తవ్యములను నిర్వర్తించవలెను;

(2) రక్షణ అధికారి మేజిస్ట్రేటు నియంత్రణ మరియు పర్యవేక్షణ క్రింద పనిచేయవలెను మరియు ఈ చట్టముచే - లేక దాని క్రింద లేక మేజిస్ట్రేటు మరియు ప్రభుత్వముచే అతని పై ఉంచబడిన కర్తవ్యములను నిర్వర్తించవలెను.

సేవలు సమకూర్చు వారు. 1860లోని 21వ చట్టము 1956లోని 1వ చట్టము

10.(1) ఈ విషయములో చేసినట్టి నియమములకులోబడి న్యాయ వైద్యపరమైన, ఆర్థికపరమైన లేక ఇతర విధమైన సహాయములతో సహా మహిళల యొక్క హక్కులను మరియు హితములను ఏదేని శాసనపుర్వకమైన రీతిలో కాపాడవలెననే ఉద్దేశ్యముతో సంగముల రిజిస్ట్రీకరణ చట్టము, 1860- క్రింద రిజిస్టరైన స్వచ్ఛంద అసోసియేషన్ లేక కంపెనీల చట్టము, 1956 లేక తత్సమయమున అమలునందున్న ఏదేని ఇతర శాసనము క్రింద గాని రిజిస్టరైన ఏ కంపెనీ ఈ చట్టము యొక్క ప్రయోజనముల నిమిత్తము సేవలు సమకూర్చువారు గా రాజ్య ప్రభుత్వము వద్ద రిజిస్టరు చేసుకొనవలెను.


(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద రిజిస్టరైన సేవలు సమకూర్చువారు ఈ క్రింది అధికారమును కలిగియుండును,--

(ఎ) వ్యధిత వ్యక్తి కోరికపై గృహహింస సంఘటనను విహితపరచబడిన ప్రరూపములో నమోదు చేసిన నివేదిక ప్రతిని గృహ హింస జరిగిన స్థలము పై అధికారితా పరిధి కలిగిన మేజిస్ట్రేటుకు మరియు రక్షణ అధికారికి పంపవలెను;

(బి) వ్యధితవ్యక్తికి వైద్య పరీక్షలు జరిపించవలెను మరియు ఆ వైద్య పరీక్ష నివేదిక ప్రతిని గృహహింస జరిగిన స్థానిక ప్రాంతములోని పోలీసు స్టేషనుకు మరియు రక్షణ అధికారికి పంపవలెను;

(సి) వ్యధిత వ్యక్తి కోరికపై ఆమెను ఆశ్రయ గృహములో ఉంచి ఆశ్రయమును కల్పించునట్లు చూడవలెను మరియు వ్యధితవ్యక్తిని అట్లు ఆశ్రయ గృహములో ఉంచిన నివేదికను గృహహింస జరిగిన స్థానిక ప్రాంతములోని పోలీసు స్టేషనుకు పంపవలెను.

(3) గృహ హింసలు జరుగుటను నిరోధించుటలో ఈ చట్టము క్రింద అధికారములను వినియోగించుటకు లేక కృత్యములను నిర్వర్తించుటకు ఉద్దేశించిన దేనికొరకుగాని, ఈ చట్టము క్రింద నిబంధనలననుసరించి సద్భావముతో చేసిన లేక చేయుటకు ఉద్దేశించిన ఏదేని చర్యను తీసుకున్న లేక తీసుకున్నట్లు కనిపించు ఏదేని సేవలు సమకూర్చువారు లేక సేవలు సమకూర్చువారి యొక్క ఎవరేని సభ్యుడిపై ఎట్టి దావా, అభియోగము లేక ఇతర శాసనిక చర్యలు ఉండవు.