ఈ పుట అచ్చుదిద్దబడ్డది
96
కువలయాశ్వచరిత్రము
- చ్చరమెఱుంగుబోడులును నై యమరావతీపురంబువారందఱును సందడింబడఁ బురం
- దరుండు హెగ్గడికత్తియలవలన విని డిగ్గున లేచి శచీమత్తకాశిని దుఃఖాయత్త
- చిత్తంబుతో నచ్చటికి వత్తుననుచుఁ దత్తరింప బొమముడితో నతిరూక్షుంబగు వీ
- క్షణంబున నిలువరించి నగరు వెలువడి తమకంబునఁ బైటికిం జనుదెంచె నంత నంత
- యు విని యఖిలదిక్పాలకులును బ్రహ్మాదిదేవతలు నేతెంచి రట్టియెడ.58
సీ. మన కేమి పని చూచికొనియుంద మీ వేమి యనఁబోకుమీ యని యనుసరించి
- నీపున్నె మిచ్చట నీపగ్గె నెరయించి బోరు దీర్పకుమంచుఁ బొందుపఱచి
- మనచేతఁ గాదు వీరిని శాంతుల నొనర్ప నూరకుండెదమంచు నొద్దనిలచి
- నానోటి కడికి విఘ్నముఁ జేసినపుడె శపింతుఁ జుమ్మీయని బెదరఁజేసి
- వారి వైరంబుఁ బురికొల్పఁ జేరి నార, దుండు వీణగవిశనను దొలఁగఁజేసి
- మెట్లు తడఁబడఁ దుడుకుగా మేళవించి, నిలువ వారిద్దరును రణోన్నిద్రులైన.59
క. హరిహయుఁడుఁ గుబేరుఁడు ని, ద్దటరు నొగి నన్నలువ యడగుఁ దమ్ముల వ్రాలన్
- గరుణించి సకలదేవో, త్కరములతో నతఁడు నిలచి తన్మధ్యమునన్.60
గీ. వలదనిన వారిలో డుస్సి వైచినట్టి, కైదువుల జూచి బలికె నే కన్మొరంగ
- నొరుల వైతురె యంచు నొందొడ్డికొనుచు, నవునెకద యంచు నతఁ డుండు నవసరమున.61
శా. అయ్యా కావరె యాడుదానవలనన్ హా యెవ్వరిం గాన నా
- కుయ్యాలింపరె నన్ను నెత్తికొని దిక్కుల్ చూచుచుం బారెడిన్
- దయ్యం బీతని నెవ్వరేని నిజఖడ్గప్రోద్యదుగ్రాగ్నికిం
- ధాయ్యం జేయక యాడుదీవెనలఁ బొందం లేరె నే మ్రొక్కెదన్.62
క. అని యెడు నాడు మొరల్ విని, ననజుఁ డిది తాళకేతువర్తన మరయన్
- మును దేవగురుఁడు శపియిం, చినచందము నిట్టిదనుచుఁ జింతించునెడన్.63
క. ధనరాజసుతు జయంతుం, గనుఁగొని యాచాయ వచ్చు క్రవ్యాదుని వ్రే
- లునఁ జూపి వీని నిద్దరు, దునుముఁడు పొండనినఁ జండదోర్మండునులై.64
క. డేగ వెరచూపు నిగుడెడు, వేగంబున నిగుడు దనుజవీరుని బుజముల్
- ప్రోగువడఁ బంచికొనుచు వి, భాగించిరి తనువుతోడఁ బాసి చనంగన్.65
వ. అంత.66
సీ. నిగనిగనిగని పెన్నెఱి గెంపు ముడి వీడి తనదీర్ఘరీతి యందఱికి దెలుప
- నడరుపాటునఁ జూచు చదురుచూపులవల్లఁ గలువ వసంతంబు గలయఁజల్ల
- నుడుగక గుండెయుఁ దడఁదడమనుటఁ గెంపుల దండ జనుఁదోయి పుటము లెత్త