ఈ పుట అచ్చుదిద్దబడ్డది
94
కువలయాశ్వచరిత్రము
గీ. ఇపుడు సైతము దానిపై నీసు లేదు, నమ్మికయె గాని యాతందనాల తపసి
- కడుపు సాకంగవలసి యీకరణిఁ జీటి, నేను గినియంగ గల్పించెనేమొ కాని.46
మ. అకటా కాదిది తారవ్రా లవును జుమ్మా కన్నె యావన్నెకా
- నికిఁ దా నంపినదేమొ చీటి మఱి వానిం జూడఁగాఁబోయి మౌ
- నికులాగ్రేసరుఁ డేమరించి వడి దీనిం గైకొనంబోలుఁ గా
- నుకగాఁ దెచ్చునె కానిచో నతఁడు నన్నుం జౌకగాఁ జూచునే.47
శా. ఔనే తార శబాసు మెచ్చవలె నాహానీగుణం బింకిటన్
- వానిం జూచిన నీకు నిన్నుఁ గనుఁగొన్నన్ వానికిన్ శోకసం
- ధానం బొందఁగఁ జేసినప్పుడుగదా, నా కూచి లేకున్నచో
- నేనే రంభనె యచ్చరల్ బొగడఁగా, నీ పేరునం బిల్వవే.48
క. అని నిశ్చయించి రోషం, బినుమడి గాఁ జీటి యిచ్చి యేమేమో మం
- తనమాడి పొమ్ము పొమ్మని, తనబోటిం బనుపఁ ఘనపదస్ఫుటగతియై.49
చ. అది చనుదెంచి నందనవనాననిఁ జప్పుడు కాకయుండఁ గెం
- పొడవిన చూడ్కితోఁ బరిజనోత్కరముం జడ మర్లి చూచుచున్
- గుదిగొన సూటి గాగఁ గనుఁగొంచు మెఱుంగుల నంట వింట బె
- ట్టిదముగ గువ్వతండము వడిం బడవేయు జయంతుచెంతకున్.50
గీ. చేరి మారంభ వనిచె నీచీటిఁ జూచి, కొమ్ము నీవంటివానికిఁ గొదవగాదె
- యాట దానికి నింతమత్తా యిదేటి, మోహమయ్య యటంచు నమ్ముదిత వలుక.51
క. ఆచీటిఁ జూచి వేలుపురాచూలి మెఱుఁగు కలకరాఁ జేటి దెసన్
- జూచి వినుమింతె విటులకు, మీ చెలికిన్ జూడు నేఁడు మెచ్చు ఘటింతున్.52
గీ. అని గిఱుక్కునఁ దిరిగి యయ్యమరనాథ, పుత్రుఁ డందఱి నిండ్లకుఁ బోవబనిచి
- సురగ దురదుర నాయింటి కరుగుదెంచి, యేమి చెప్పుదుఁ బొదరింటి కేగుదెంచె.53
మ. అపుడే క్రొవ్విరులంది యీయ ధనరాజాపత్య మచ్చంపు ని
- క్కపుఁబ్రేమన్ జడయల్ల నే మడు పొసంగం బట్టి చేనొక్కి నే
- రుపుతో నిచ్చినఁ గాని యొల్ల నని మార్మో మైన నేనంతఁ బ
- ల్కుపరాకింద మటంచు మర్ల యొసగం గోపంబు దీపింపఁగన్.54
క. ఔనన్నా నరకూబర కానీమన్నా యటంచు గ్రక్కునఁ దిరిగెన్
- దానుంజనె నర్థేంద్రజుఁ డేనున్ భయ మొదవ నింటి కేగితి నంతన్.55
క. సూరెలను నింద్రజుఁడు కో, లారిక మందిన నతండు లలితోల్లాసం