ఈ పుట అచ్చుదిద్దబడ్డది
92
కువలయాశ్వచరిత్రము
చ. విడువని కౌఁగిలింత పురివిచ్చని మచ్చిక తన్పు లేని సం
- దడి కొసవింత చూపు మరునాటికి రమ్మని మ్రొక్కు తోడిత్రొ
- క్కుడు వగ మాట నీటొలయ గూడని నెమ్మది గల్గి యొక్క కై
- వడిఁ నెడఁ బాసి యింటికిని వచ్చితి నాతఁడు నేఁగునంతటన్.31
క. దినదినమున్ వనమున ముం, దనజనముం గను మొరంగి ధనరాట్సుతుతో
- ఘనరాగము దనరారఁగ, ననరాళక్రీడ నోలలాడుచునుందున్.32
ఉ. అక్క యిదేమొ కాని తెలియంబడ దాతఁడు వీధి థివెంట బల్
- టక్కులతోడ రాఁ బొది గిటన్ నిలువంబడి తొంగి చూచుచో
- దక్కిన చేష్టలున్నవెకదా మఱి యెక్కడనుండి వచ్చునో
- పక్కున నవచ్చునమ్మ చలపాది మిటారపునవ్వు తొక్కటన్ ,.33
క. తనువు జయంతుని క్కన్, మనసాధన రాజవరకుమారునిచెంతన్
- జొనుపుదుఁ గోరకదశ'నా, ననదసెనాజోదు దురమునం బెనఁగునెడన్.34
సీ. చెలరేఁగి వలరాచవెలుపుల పెనుకతల్ వినిపించునప్పు డూకొనెడుదారి
- ఎటుఁ బోయి తన నిట్టి యెడకంచుఁ బొసగింపఁ బోవుచోఁ దడఁబడుబొంకుమాట
- వ్రేకఁటి యలుక కల్పించి మంచముకోఁడు గౌఁగలించుచొ కమ్ముగాని వింత
- యల్లయాచెలి మంచిదని మెచ్చుచోఁ కోపగించక మైకోలు గాంచు నేర్పు
- నించువిలుకానిజగడాన నెంతతడవు, చాలునను పల్కు నిన్నాళ్ళసరణి రాజ
- రాజతనుజాతుఁ దలప కూరకయ యుంటఁ, దెలిసి దేవేంద్రసుతుడు సందియముఁ జెందె.35
గీ. అంత నచ్చట రంభామృగాయతాక్షి, యేమొ నలకూబరుం డంటి యిరవుకొనియె
- నౌర యంటినఁ గమ్మకు మారుకమ్మ, యంపఁ డెంతటి దొరతనం బనుచుఁ బలికి.36
సీ. విననింపుగా మేళవించి యుంచినయట్టి యల్లవీణియ యుంచి నట్లెయుండ
- వెరబొంత గౌసెన వేసి మూసినయట్టి యరలపెట్టియ మూసినట్టెయుండ
- నెఱికగాఁ బెట్టి దండెముమీఁద వైచిన యంగదట్టము వైచినట్లయుండ
- నెరపుగా నూరి గిన్నియల నించినయట్టి యరిదికుంకుము నించినట్లయుండ
- నెందుపై నిచ్చలేక యేమేమొ తలఁచు, కొనుచుఁ జెలులను జంకించుకొనుచు జిలుక
- కొసరుమాటకుఁ గట్టిగాఁ గసరుకొనుచుఁ, దాళగూడని వింతవిరాళి యెత్తి.37
గీ. చికిలిలోపలనే చీమ చిటుకుమన్నఁ గనకననకూయు బకదారి కవలకడన
- మరుని వెరళించు మల్లంటు విరులకడనఁ, బడుకయిలు మాని విరహతాపంబు బూని.38
సి. నీనాయకుఁడు వచ్చెనేయన్న విసువుగా నతఁ డేమిటికి వచ్చునమ్మ యనుచు