ఈ పుట అచ్చుదిద్దబడ్డది
90
కువలయాశ్వచరిత్రము
- యల నలకూబరుం బిలువనంపర యంచును బిల్వఁ బంచి సొం
- పులఁ గడకంటిచూపులనె ముచ్చట తీరఁగఁ జూతు నాతనిన్.15
ఉ. జవ్నని యించుకే మొగము చాటున నుండఁ గుబేరసూతి యా
- దవ్వులనుండి నాపెదవి తప్పక కన్గొన నే నెఱింగి లో
- నువ్విలులూర ముద్దుమొగి యూరక తా బయలానినందుకే
- నవ్వఁగఁ దాను నవ్వి సురనాథకుమారునిఁ బిల్తునా యనున్.16
సీ. వానిఁ యొయారంపుఁ బావలు తెప్పించి సిబ్బంపుఁజనుఁదోయిఁ జేర్చుకొందు
- క్రేవఁ దప్పక చూచి ఠీవిగా వాడంత ననుఁ జూడఁ జూపు గ్రక్కున మరల్తు
- వానిపైఁ బద్య మెవ్వరు లేనివేళఁ బాంచాల శయ్య పొసంగఁ జదివికొందుఁ
- బరులతో నర్మోక్తి పలుక నే నెఱిఁగి లేనగవుతో వానినెమ్మొగముఁ జూతు
- మఱియు నొక్కొకవేళ సుమాళ మొదవఁ, బరిమళంబుల బాగాలు పలక నుంచి
- నే నొసంగగఁ గొంకిన దాని కరణిఁ, బ్రియునిచేతనె వాని కిప్పింతునమ్మ.17
చ. అలికచ జోలి తప్పునటు లయ్యెడు నాదువికార మంతయున్
- దెలుపఁగ వచ్చినన్ వినఁగదే మఱియంతట నొక్కనాడు నె
- చ్చెలుల మొరంగి కేళిగృహసీమ జయంతుఁడు లేనివేళ గు
- బ్బలపయిఁ బైటజారఁ బువుపాన్పుపయిం బడి నెమ్మనంబునన్.18
సీ. ఇది యేమి చోద్యము మదిలో వితావితా నలకూబరునిమీఁద నాటెఁ బ్రేమ
- దొర కుమారుండును దురుసు కటారి గా డీజయంతుఁడు బాయనీఁడు నన్ను
- వాడైన మఱిఁ గొంచెకాఁడు మాష్టీని జోకలు జూపఁదగు పగకాఁడు కాని
- యందఱిలో మున్నె యగడౌట చాలదే యింక గొహారు వాదేల తనకు
- నేటికి గొహారు తనకు నాకేల వెఱవ, నౌర యిల్లాలనా వారివారికరణి
- కంటికింపైన వానితోఁ గలసి మెలఁగ, నన్నుఁ గన్నాఁడు మావార్ధినాయకుండు.19
ఉ. ఒక్కటి రంభ యేమను నొకో యని లోఁగుట యంతె కాక నా
- కెక్కడి యాజ్ఞ యాసరసిజేక్షణకైనఁ బనేమి యెమ్మెకా
- డొక్కతె సొమ్ముగా నిలుచునే యది యేలికసానియే యిదే
- మక్కట యైన గాని నిలయంబున నుండఁగ హత్తుకొంటినో.20
ఉ. అందుల కేమి యప్పటికి నైనటు లయ్యెడు గాని నేను వా
- రందరు గానకుండఁగ ధనాధిపుపుత్రునిఁ దెచ్చి కూర్చువా
- రిందు మఱెవ్వ రిట్టిపని యెవ్వరితో నెఱిగింతుఁ గూడ దీ