ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరస్తు
కువలయాశ్వచరిత్రము
పంచమాశ్వాసము
క. శ్రీకర సవరము తిమ్మధ, రాముకగర్భజలధిరాకాచంద్రా
- లోకనుతగానగుణసం, ధాకర్ణసమాన నారణ నరేంద్రమణీ.1
గీ. అవధరింపుము జైమిని కలపతంగ, కులపతంగంబు లిట్లని తెలుపఁదొడఁగె
- నమ్మదాలసతో మనోహరసుధా, విధానధానవచోరీతిఁ దారపలికె.2
వ. అవ్విధంబున నమరావతీపురంబుఁ జేరి నలకూబరుండు.3
మ. తననీటుల్ మెఱయించు జేన పొడవుం దాల్మింటి యందంపుఁ గుం
- దనపుందల్కులు గ్రుమ్మరించు చిరుసానాకత్తి చిమ్ముం గళం
- బున గోరొత్తుల పేరి యారజుపు సొమ్ముల్ మోవి పైఁ గెంపు ని
- గ్గును మీసంబులు దిద్దినాడికొను జగ్గుల్ మీర నావీథులన్.4
సీ. చూచి దిగ్గున లేచు సుదతిఁ గూర్చుండవే యనుచోట మొగమున నలరు కులుకు
- రంభసేమము వేఁడు రమణీమణి మొగంబుఁ జూచుచో నవ్వులో సొలయు హొయలు
- నెదురుగాఁ జనుదెంచు నింతి మ్రొక్కుల నందికొనుచోటఁ జూపులోఁ గులుకు సొగసు,
- కని యందలము డిగ్గు వనితతోఁ బరిహాస మాడుచో మాటలో నందగింపు
- బుడత లందిచ్చు తెలనాకు మడపుపంట, నందికొనునీటు నుడువులో నారజంపు
- బిత్తరపుపాట రొమ్ములో బిగువు నెగడ, నేఁగు నాకారివెంట నయ్యెమ్మెకాడు.5
ఉ. చక్కదనాల కేమి నెఱజాణవు నే కద తప్పుగాదు లే
- టెక్కుల రంభభాగ్యము కడింది సుమీ యిటువంటినాయకున్
- దక్కఁ బెనంగెఁ జూడు మనినం బిగువెత్తెదు నీకు రోసమా
- యెక్కడిదో యటంచుఁ గలహింతురు నాథులతోడ నచ్చరల్.6
చ. అలిగెడుతీరు వేడికొను నందముఁ బొందికలోని పారువా
- పలుకుల భేదముల్ సురతబంధములుం గళలంటు వైఖరుల్
- వలపులు రేఁచు పేర్చు నెరవాదులతో వివదించు కట్టుఁగొంగు
- లముడివీఁడ నచ్చరలు గుంపయి పొంచు వినన్ ముదంబునన్.7
చ. వెలుపలిరచ్చ నొక్కయెడ వేలుపుసానికి వన్నెకానికిం