ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము
87
చ. స్ఫురితవిభాసమానమగు పుష్పకనామ విమాన మెక్కి ని
- ర్జరతతి తోడ నేఁగి దితిజక్షణశిక్షణదక్షరూక్షభా
- స్వరశరసాంద్రు నానృపతిచంద్రు నుతించు సురెంద్రువెంబడిం
- దిరిగి శుభాకరంబగు తదీయపురంబును జేరి యందులన్.214
క. అల యదితి విప్రపూజలు, సలుపంగనుఁ గొనఁగఁ బాకశాసనుఁడు తనున్
- నిలుపఁగ నులుపనించిన, చెలువొందెడు విడిదెలో వసించె నతండున్.215
గీ. అన మదాలస తారామృగాంకవదన, తెల్లముగ మీఁదికతలెల్లఁ దెలుపుమనియె
- ననిన జైమిని ముని యావిహంగములన, నంతరకథావిధం బెట్టిదని యడిగిన.216
ఆశ్వాసాంతపద్యములు
శా. సంధ్యాతాండవచండఖండపరశుస్ఫాయజ్జటామండలీ
- సంధ్యాహిండితగాంగభంగజ మిధస్సంఘర్షి పుంజీకృతా
- వంధ్యారావ ఘమం ఘుమోన్నతి సదృగ్వాగ్జాల పుణ్యాకృతీ
- వింధ్యక్ష్మాధర కూట గోటి విచరద్వీద్వేషి యోషిత్తతీ.217
క. అమితప్రతాప తాపని, సమదానవిభాసభావజన్మాకారా
- నుతగోత్ర గోత్రభిష్టుక, హిమకరనిభకీర్తికాండ హిమకరగండా.218
మాలిని, ధరణిపకులసోమా, దర్పితారాతిభీమా పరిహృతకవిభూమా భానుసంకాశధామా
- సరసకవనభోజా సాధుసంతానభూజా, మురరిపునుతతేజా మూర్తిమాంబాతనూజా.219
గద్య
ఇది శ్రీమన్మదనగోపాలకటాక్షవీక్షణాసమాసాదిత సరసకవితావైభవ సవరమన్వయా
- భరణ నారాయణభూపాలతనూభవ శఠగోపతాపసేంద్రచరణారవింద సంచలన్మా
- నసమిళింద సంతతభారతభాగవతాదిశ్రవణానంద కామినీమనోహర రూపరేఖావిజి
- తచైత్ర కాశ్యపగోత్రపవిత్ర జాతివార్తాకవిజనామోదసంధాయక చిననారాయణనా
- యకప్రణీతంబైన కువలయాశ్వచరిత్రంబను మహాప్రబంధంబునందు చతుర్థా
- శ్వాసము
సమాప్తము