ఈ పుట అచ్చుదిద్దబడ్డది
6
కువలయాశ్వచరిత్రము
చ. అతఁ డనుజన్ముఁ డైన సుగుణాఢ్యుఁడు లక్కవిభుండు తోడుగా
- నతులితుహిందుఖానుని బలావళి ద్రుంప నిలింపు లింపున
- న్వితతలతాంతవర్ష మొచవించుట మించు వరించ నెంచి స
- మ్మతి జయలక్ష్మినించు నవమౌక్తికపుం దలఁబ్రాలు కైవడిన్.32
సీ. నలుపుఁగస్తురిగీఱునామంబుఁ దుడిచి యేతెంచినఁగాని సంధించమనుచు
- నిడుదముత్తెపుటొంట్లు సడలించుకొని చెవు ల్పూడవైచినఁగాని చూడమనుచుఁ
- గమనీయమణికిరీటము డించి పైఠాణిపాగ చుట్టినఁగాని పలుకమనుచు
- దంభోళి విడిచి క్రొండళుకు సింగిణివిండ్లు చేకొన్నఁగాని హర్షింపమనుచు
- జిష్ణుతో మాటలాడ హేజీబు ననుతు, రౌర తిప్పనృపాలబాహాసినిహతు
- లైనయలహిందుఖానసేనాధిపతులు, నిండి సురపట్టనముచెంత దండు విడిసి.33
గీ. తిప్పనరపాలకరవాలదీర్ణయవన, ముష్టిహతి రంభ నెడసి సమ్ముఖముం జేగు
- తనయుఁ గని రాజరాజు సంతసముఁ జెందుఁ, దురకగ్రుద్దును బనికివచ్చెర యటంచు.34
క. బిసరుహనయనావిసర, ప్రసవకలంబకుఁ డతండు పరితోషితవి
- ప్రసతీకదంబనానన, హసితైందవబింబఁ గోనమాంబ వరించెన్.35
క. ఆ తిప్పనృపతి కోనాం, బాతామరసాక్షియందు బాంధవరక్షా
- ఖ్యాతుని దిమ్మధరాధిపు, నాతతగుణకలితు వేంకటాధిపుఁ గనియెన్.36
ఉ. వారలలో శఠారినృపవారకఠోరకుఠారధారణో
- దారమహామహీతలవిధాయకకుంకుమసత్కురంగనా
- భీరసరేఖికాకృతి గభీరభుజంగమభోగబాహుదు
- ర్వారుని దిమ్మభూవరునిఁ బ్రస్తుతి సేయ వశంబె యేరికిన్.37
సీ. పరకాంతసంగతిఁ బరఁగుకూర్మస్వామి యబ్రమే బహుళజడాశి యగుట
- రాజభామ వ్యాప్తిఁ బ్రబలు భూధరపాళి యరుదె గతశ్రవణాగ్ర మగుట
- సద్విజవనితల సక్తి గాంచినపోత్రి వింతయే వెలివేయు విధులఁ గనుట
- కుండలీశ్వరసుదృక్కులఁ బొందుకరిరాజపటలిభారమె యధఃపాలి యగుట
- యనుచు భూదేవి తిమ్మభూపాగ్రగణ్య, బాహువం దుండి యొసపరిబాగుమీఱ
- గరువమునఁ బల్కు నిఖిలలోక ప్రతాన, కార్యపరిశంశితత్కీర్తికాంతతోడ.38
సీ. చనవు తానని వచ్చినను లేవ కలమంజుఘోష మోచేకొద్దిఁ గొట్టువడియెఁ
- గొనగోఱఁ జెక్కిలిఁ జెనకి ఘృచికాదేవి దేశీయంపుఁ దిట్టువడియెఁ
- బుక్కిటివిడె మీయఁబోయి తిలోత్తమావనజలోచన ముచ్చెవాట్లుపడియెఁ