ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము
85
గీ. వచ్చి యవధారు కువలయాశ్వక్షితీంద్రుఁ, డల్లపాతాళకేతుఁ గీటడచె ననుచు
- నచటి కరుగుచునుండి సురాధినేత, మిమ్ము రమ్మని యిదె యుత్తరమ్ము పనిచె.203
క. అని వినిపించు కుబేరుని, కని చెంద్రిక మీఁదవ్రాసి యందు శిఖావే
- సిన కమ్మగద్దె చేరువ, నునిచినఁ జూచుకొని చుట్టి యున్ముఖుఁ డగుచున్.204
సీ. హరినీలములమేడ యవలకెంపులసజ్జు కడమకట్టఁగ నుడుగర యొసంగి
- పెరచోట వడి దాచిపెట్టిన నవనిధానములు దేవాప్తసంఘములఁ బనిచి
- కారుకు లెత్తి చక్కఁగఁ జేయుఁ డలచైత్రరథమని తగుభటప్రతతిఁ బనిచి
- యరయమిచే డొక్కలంటిపెట్టుకయున్న యిభకోటులకు మేపులిడ ఘటించి
- పుడమిఁ బాతాళకేతుండు గెడసినపుడె, నిత్యముగ నిల్చె నలకాధిపత్య మనుచు
- ననిమిషాధీశ్వరునిచెంత కనుపఁదలఁచి, పుత్రుఁ బిలుమన్న నూడిగంపుభటు లపుడు.205
గీ. తోడి యక్షకుమారుల తోడఁ గోడి, పడవగొడవలఁ బడి యర్ధపతిసుతుండు
- గౌడమైల శలాయత్తు కాకివన్నె, మొదలుగాఁగల కుక్కుటంబులను దెచ్చి.206
ఉ. పట్టెపుజుట్టునిక్కు మెడబాగునఁ జివ్వనయారెపొంకమున్
- రెట్టలబల్మి నెమ్మిఁ బురణించిన యీకలజోకులున్ దగిల్
- గొట్టకయుండ మేపు పలు కోయపుమందులు గల్గు పుంజుఁ జే
- పట్టి గ్రహంబు వెన్కఁ గనుపట్టఁగ నల్లలు దీసి యంతటన్.207
గీ. ఎదుటిదానిని విడుమంచు హెచ్చరించి యతఁడు తను వేగిరింప మల్లాడికొనుచుఁ
- గినిసి యొండొంటిఁ బిట్టుదాకించి యీసు, బొడమ రెంటిని గదియించి విడుచుటయును.208
వ. అప్పు డనిర్వారగర్వధామంబులగు నత్తామ్రచూడసార్వభౌమంబు లతిరూక్ష వీ
- క్షాపరంపరలఁ జురం జురంజూచి పవరంజుకొని జుంజురించిన మెడలు నిగుడించు
- కొని సాటి ని యీసునం గాటియ్యక తిరుపులుగట్టిన యొరఫునం దిరుగుచు నింపు
- సొంపుల గుంపులు గొని నిజవిజయపరాజయంబులు గోరుచు నొకళ్ళొ కళ్ళ త్రొక్కు
- ళ్ళఁ బొడము జగడంబుల జరాలుమనం గటారులు డుస్సుకొని పెద్దలు వారింపం దే
- రి యచ్చటికిం జేరి ముంచుకొను కొంచెపుగాండ్రు పెడమోము వెళ్ళినటింక వెంట ను
- ట్టినడువ గోడి నెత్తికొనుపోవుచు నెట్టికొనిదగలు తొట్టినం బట్టి యీకలందె
- మడ వెడలించి పన్నీటితేటల రెట్టలకుం జలువ పుట్టించిన కట్టలుకంబట్టి తప్పించు
- కొని యొండొంటి నంటి నొప్పించుచు నేవమీరి గౌతమమునిపుంగవాంగనామా
- నభంగకరణాదికారణారవనిర్నిద్రచరణాయుధలోకపట్టభద్ర గెలిచితి వనుచు
- నుతించుచుఁ బంచెవన్నె పావడలు వైచుచు మచ్చరంబున నిరువాగును నెచ్చరించి