ఈ పుట అచ్చుదిద్దబడ్డది
84
కువలయాశ్వచరిత్రము
- మ్రొక్కుచు నదల్చి నునుపోకముడి వదల్చి, కరఁగఁ జేసిన యటుమీఁదఁ గౌగళించు.194
చ. పరిపరిరీతులం బ్రసవబాణునికేళి యొనర్చు తొంటివై
- ఖరి నెర పారుతంపురొద గానఁబడం దలయెత్తి నామనో
- హరుఁడవు నీవ యంటి నవురా యను నంతటి పారవశ్యముం
- బొరయుదు నుస్సురంచుఁ గనుమోడ్చుట లేదిపు డించుకేనియున్.195
క. నెనరైన దాని కిటువలె, గనరైనను వీడ చూచెఁ గడుమాలిమిచే
- దనరంగ స్మృతులు నెయ్యెడ, పనవవె యతిపరిచయావజ్ఞా యనఁగన్.196
గీ. దీనిపొగ రార్ప నెరవేర్చు దిట్టతనము, మురువు హరువును గల జగన్మోహనాంగి
- లేదుగా యంచు దివిని గాలింతు నేఁడు, కలిగెఁ గాతార నవకాంతి చలితతార.197
చ. అని చెలికాండ్రతోడ నతఁ డాడిన ముచ్చట లెల్ల వారు నన్
- గనుఁగొని వచ్చి యిచ్చకముగా వినిపించిన నెంతమాట చ
- క్కని జవరాలు రంభ యదిగాక జయంతుఁడు తామునుండు వ
- ర్తన కిది మేరె తా మెరుగరా యని చీటిని బుచ్చి పంపుదున్.198
ఉ. అంతట నొక్కనాఁ డల ధనాధిపుఁ డశ్వము వాగె వెక్కసిన్
- రంతులు మీర నెక్కి పెనురౌతన జోడన చెల్వఁ జూపుచుం
- బంతము మీర వీథుల దుమారము రేఁగ సవారిఁ జేసి ప్రొ
- ద్దెంతయు నెక్కఁగా నడుమ యించుక మేపశ్రమంబు పూనఁగన్.199
చ. హరి గెలనీడ వేత్రధరు లయ్యెడ నామము లుగ్గడించి హె
- చ్చరికె యొనర్ప మ్రొక్కు భటజాలము వీడ్కొని యాస్యపద్మముం
- బరిజనులంద పుంజలువబావడలం దుడువంగ నాత్మమం
- దిరమున కేగి యందు నొకతిన్ననికెంపులతిన్నెనిల్చుచున్.200
ఉ. జెట్టులు చేరి లేత విడి చెందొవవ్రాతరుమాలువున్ సిగం
- జుట్టి యలందుకుంకుమపుసోకుల బంగరుతీగెరంగు ని
- ట్టట్టన నీని జందెము భుజాగ్రమునం బడనై చి సీత్కృతుల్
- దట్టము గాఁగ వింతవగలన్ మెయిమర్దన సేయునత్తరిన్.201
చ. చెలువపు వెన్నతోఁ జలిది చిక్కములున్ మెడతాఁడు చీఁకటుల్
- గులికెడు నీలిదట్టెపొరలోపల కమ్మచెరంగు వెన్నునం
- దొలకెడు నెత్తిజుట్టు తెలిదుప్పటి వీనుల మానికంపు నా
- గుల పడగల్ రహిన్ దగనొకొండగు యోంటరి బోయఁ డుద్ధతిన్.202