ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము
83
- వలిచన్నుఁదోయి గొప్పులదండ గీలింతు నది మాని ముత్యాలహార ముంతు
- మినుకుసైకపువ్రాతపనిచీరఁ గటిఁ దాల్తు నది మాని తెలిచల్వ యలవరింతు
- రవిక బిగియింతు నదియును నవల వైచి, కుంకుమపుఁబూత చిమచిమఁగొనెడు చిన్ని
- పచ్చికొనగోటితాఁకులు రచ్చసేయ, గుబ్బ యరగానరాఁ బైటకొంగు వైతు.188
చ. విను మిటులుండఁగాఁ దిమిరవేణి కుబేరుఁడు కమ్మ పంపఁగా
- దిన చిరి చీటులందు గడిదేరు జయంతుని వర్తమానముల్
- విని నలకూబరుం డదిర వేలుపుఱేని కుమారునిన్ ముదం
- బెనయఁగ నింత సేసె నిది యెంతటిదో యని విస్మయంబునన్.189
సీ. తిరుగఁడే కొన్నాళ్లు సరసీతిలోత్తమాపుంభావసంభోగములకుఁ జొచ్చి
- చెలఁగఁడే కొన్నాళ్లు చిత్రసేనాకంతు పారావతారావపటిమఁ దగిలి
- నడవఁడే కొన్నాళ్లు నవమేనకాధరాధరసుధాపానవిస్ఫురణ కలరి
- మెలగడే కొన్నాళ్లు కలితోర్వశీవశీకరుణాకరోక్తి వైఖరికి మెచ్చి
- కెరలి దెరగంటి దొరసూతి కేళులందుఁ, జొచ్చి చూడక మానినచోటు గలదె
- నన్నుఁబలె యోర్తు పైఁబడియున్నవాఁడె, సుకరముగ మేలువడెనె వా డొకతెకేని.190
గీ. చదివికొన్నాడు మదనశాస్త్రంబులెల్లఁ, తెలిసికొన్నాడు వెలమిటారుల బెడంగు
- కొసరు వగలెల్ల నటువంటికోడెకాని, వలచి వలపించుకొనియె నే వనరుహాక్షి.191
సీ. అతఁ డింటి కల్లంత నరుదేరఁ దావచ్చి మించుచూపులనె తేలించునేమొ
- యతఁడు కీల్జడ కేల నదిమిన మే నోసరించి కోపమున గద్దించునేమొ
- యతఁ డించుక పెనంగి యలయఁ దానదలించి మించి పైకొని పచారించునేమొ
- యతఁడు చక్కెరమోవి యానఁ దా గుల్కు టెల్గించి బిగ్గిలఁ గౌగలించునేమొ
- బెడఁగు మొనపంట సగమాకుమడుపు లిచ్చి, కొసరుమాటల మఱియును గూడ నెచ్చ.
- రించి యాతని కాస పుట్టించునేమొ, బాల సురతాంతమందు బాగా లొసంగి.192
క. ఇది గంటివి యీవరకున్, మదనక్రీడారహస్యమతకోవిదయై
- ముదమునఁ దేలింపుచు నను, చదురాలై యిపుడు చాల ఔక యొనర్చెన్.193
సీ. నేవచ్చువేళఁ దా నింట నుండకపోయి పొరుగింట నిరుగింటఁ బ్రొద్దు గడపు
- నలవాడు నీచుట్ట మరుదెంచె ననిన నేమాయెలే వచ్చుఁగాకంచు బిగియు
- నిలలేక స్వయముగాఁ బిలువఁబోయినఁగాని బెదరించు నిదిగో వచ్చెదనటంచు
- వలసినప్పుడు వచ్చి యలిగియున్నట్టి నే పలికించుదాక దవ్వులనె నిల్చు
- నంతటను నేనె పైటకొం గలమి బలిమి, సెజ్జపై దార్చి యలకలచిక్కుఁ దీర్చి