ఈ పుట అచ్చుదిద్దబడ్డది
82
కువలయాశ్వచరిత్రము
- రిచ్చవడుమోముతోఁ జేరవచ్చెనేని, గుండె భగ్గున నే మనుకొందు నబల.180
చ. వలచుట జాతిలోనఁ దలవంపగునే కద యింకఁ దాఁచఁగా
- గలిగెడి దేమి నాననుపుకాండ్రను దొల్లిటి వారి వీథిలో
- పలఁ గనినంత వెచ్చనగుబాటున కోరిచి యన్నదమ్ములన్
- బిలిచినరీతిఁ బిల్వ వలపించెఁ జుమీ యతఁ డంబుజాననా.181
గీ. అట్లు వలపించి లోనయ్యె నంచుఁ దెలసి, తరుచు కావళ్లు పెట్టి మాయిరుగుపొరుగు
- చెలులతోనైన ముచ్చటఁ పలుక నీఁక , త్రాడు గట్టినవాని చందాన నేలె.182
సీ. పలుకనియ్యడు కమ్మవలపు హెచ్చన నాసనములు దెచ్చిన యింద్రవనితతోడ
- జూడనీ డొకవేళ జోగునకై వచ్చి మేలు దెల్పెడు జోగురాలి నైన
- గూడఁగానీడు కొక్కోకంబు చదువుకోఁ జేరు వేలుపు రాచ చిన్నపడుచు
- సరసమాడఁగనీడు వరుసఁదప్పక తెచ్చి విరులిచ్చు పుష్పలావికలతోడ
- అకట యేమందు తల్లి యిల్లాలికైనఁ నెడగలదు గాని వానిలోనడచుదాని
- కుబుసుపోకకు నేని వేఱొక్కదారి, మిసుక కూడదు మేరకు మేర గాక.183
సీ. తారావధూటి బందాకోరుగాఁ జేసె మనజయంతుఁడె జాణయనెడువారు
- నదిగాక మోహింపఁ డతని బంటుగ నేలుకొనుటకై యట్లున్నదనెడువారు
- దీని కేమాయెనే వానిఁగాక మఱెవ్వరిని బిల్వదఁట చూడు మనెడువారు
- నది బుంతవాని మాయలకు లోగునె యెందరిని జక్కఁబెట్టునో యనెడువారు
- ననుచు నచ్చర నెచ్చెలు లాడుకొంద్రు, నిగళములతోడ మదహస్తి నిగుడు పగిది
- వెంటఁ గావలి మాస్టీలు వేగిరింప, భూధరారాతి నగరికిఁ బోవువేళ.184
క. ఆతఁ డెంత యెంచినను సం, మతమై మదిఁ దోచుఁగాని మఱి యితరవిటా
- యతనానావిధలోక, స్థితి గొందల మొంప వలపు చెడ్డది సుమ్మా.185
చ. అడకువ గాని పేరిమి జయంతుని పట్టున నొక్కతీరుగా
- నడతునె కాని మున్ను నెర నమ్మిన నెచ్చెలికాండ్రు వచ్చి నా
- కడపయ మెట్టిరేనిఁ జతకాపడ నిత్తు విరుల్ దుకూలముల్
- విడెములు నాదిఁ గాగ నను వేఁడక మున్న ప్రియంబుఁ జెప్పుచున్.186
క. మిన్నక తదీయసఖు లే, కన్నియ గావలెనటన్నఁ గానీ దానిన్
- చిన్నారినగవు చూపుల, సన్ననె రప్పించి కూర్తు సమ్మద మొదవన్.187
సీ. ఒరపుగా విరులతో నెరికొప్పు ఘటుయింతు నదిమాని గీల్జడ యల్లికొందు
- గీఱుచు గుమ్మడి గాజునామము దీర్తు నది మాని డిల్ల బొట్టవధరింతు