ఈ పుట అచ్చుదిద్దబడ్డది
80
కువలయాశ్వచరిత్రము
- దొరలు వచ్చిరటంచుఁ తిరుగు తొక్కుళ్ళ నియోగు లొక్కొకచోట నొదిగినిల్వ
- నలయమాత్యులు నిల్చు టరసి పాఱులను గంచుకి ముక్కుమొకముఁ జూడకయె తఱుమ
- గట్టికవాని యాగ్రహవృత్తిఁ గని పౌరు లంతంత సన్నఁగ నఱుఁగుదేర
- నభ్రయానంబు వీడి హయంబు పురముఁ, జేక నీనారి తిరిగి యాచెలువ నడుగ
- యదియు నావల్లఁ దెలిసి యియ్యధిపవర్యు, కటకమని తెల్పనఱిగితిగాదె మున్ను.164
క. అటువంటి కూర్మికత్తియ, కుటిలాలక నెడసె నేమొకో యది విధి సం
- ఘటనము గావలె నీవలఁ, గటకట యీకార్య మెట్లు గావినఁ బడౌనో.165
క. ఆని పతి తలపోయఁగ నిం, పున వీణియలంచు గీతముల్ వడిఁ బలికిం
- చినగతి వినఁబడె నిద్దఱ, వనితల యన్యోనకలహవాచాప్రౌఢుల్.166
సీ. చనవరివలె నెందుఁ జనెదు నడ్డము లేక మాకును నొకయడ్డమా మృగాక్షి
- యంతటి దొరసాని వగుదు వెవ్వతె వీవు, తెలియదే యింద్రుని కొలువుదాన
- నతనిఁ గొల్చినవార లరయ నెందరు లేరు వారిలో నెంచఁగ తారగానె
- యిటు నిల్వు మెవ్వతె వైన నేమిభయంబు నిలువదీరదు పోవవలయు మాకు
- యెంతవేగిరకత్తివే యింతికాన, మామగువ గొల్వవచ్చితి మోమిటారి
- యేరిఁ బోలుదు కొలిచినవారిలోన, సుదతి యాకారగరిమంబు చూచి పల్కు.167
క. అను కలకలంబు చెవిఁ బడఁ, గనుసన్ననె యవసరంపుఁ గల్కిమిటారిన్
- వినిరమ్మని చెలి పంపినఁ, బనివిని యది వచ్చి వినయపరవశ యగుచున్.168
చ. సముఖమువారిఁ ద్రోచి బురుసాపని చీరజరీచెరంగు వ
- స్త్రమునకు మాటు సేయుచుఁ బరాకు లతాంగి సురేంద్రు కొల్వుబో
- గముదఁట పేరు తార యనఁగా నుతిఁగన్న మిటారి యెంత గ
- ర్వమొ యిటుచొచ్చి రా నచటివాకిటికావలి చెల్వ నిల్పినన్.169
క. వారల జగడపుమాటల, తీ రిది వే ఱేమి లేదు దేవి యనఁగఁ గ
- న్యారత్నంబును విస్మయ, మారంగను గొమ్మనిక్కమంతయు వినుచున్.170
గీ. ఎదురుగా నేగి యౌనెకా యచట నిలిచి యెంతవింత నటించితి విందువదన
- చాలు రావక్క యనుచుఁ గెంగేలు వట్టి, తోడుకొనిపోయి బంగారుమేడమీఁద.171
చ. కలప మలందుచో నొలుకు కస్తురిచిందులచేత ఘమ్మనన్
- వలపు నెఱుంగు బంగరుతివాసిపయిన్ దగునొక్కరంగుకే
- ల్సులువు పరంగిలాగి జిగిచొక్కపుఁ గద్దిగమీఁచ నిద్దరుల్
- దలగడఁ జేతులూఁది చిఱునవ్వులతో వసియించు యున్నెడన్.172