ఈ పుట అచ్చుదిద్దబడ్డది
78
కువలయాశ్వచరిత్రము
- శ్రీకంబుల్ మహిపావలోకములు నారీమౌళిపై వ్రాలుచున్.148
చ. అలికచ కావిమోవి బెడఁగానెడు తేనియ సోనవానలన్
- నిలిచి శరీరకాంతి ఝరిణీపరిణీతములై కుచాచలం
- బులఁ దప మాచరించుచును మున్ను వరోరువిలాసిరంభతో
- గలసిన కొంకుపో విభుముఖంబుఁ గనున్ నృపవీక్షణావలుల్.149
క. మినుకు చనుగుబ్బగుబ్బలి, కొననుండియు గాఢనాభికూపంబునఁ గ్ర
- క్కున దుమికి నెలవు మఱిఁ గనుఁ, గొనమి న్నృపుచూపు లుడ్డుకుడుచుచు వెడలెన్.150
గీ. కలికిలేగౌను నిలువెల్ల కల్లయగుట
- వెస నదృశ్యాంజనంబు సేవించెనేమొ
- నెగడ దటులయ్యుఁ బతిదృష్టి నెమకఁదొడఁగె
- వెఱచువారలఁ గనుఁగొన్నవెంటఁ బడరె.151
క. ఈనటనఁ జూచి నివ్వెర, గానఁబడన్ రాజహంస గమనాదృతిచే
- మానసము మానసముగా, నానరపతి యతిశయప్రియంబు దగంగన్.152
సీ. శాబాసు ననచెండు జిగిఁ జెండుచనులొండు గబ్బిగుబ్బలిచాలు గెబ్బఁజాలు
- హయిసరే నెఱిమించు నదలించుకనుమించు కమ్మదమ్ములమేలు గ్రుమ్మఁజాలు
- చాగురే విరిపువ్వు సరిరవ్వు చిరినవ్వు తొగరాచ జిగిజాలుఁ ద్రోవఁజాలు
- మాయురే యళిపెంపు మరపింపు నెరిగుంపు మేలినీలపుడాలు వేలజాలు
- మెలుసంపంగి డండలు డీలుపఱచు, కెలునునుపూలతీగెల వ్రీలజాలు
- వాలుగల డాలు దొరచేతి వాలుకలువ, వాలుగాబోలుఁ దలఁప నీవాలుగంటి.153
చ. అని కొనియాడి చేడియ నొయారపురాశిని జేసినట్టి య
- వ్వనజజు చేతికిం బిరుదు వైవఁగనచ్చుఁ గదయ్య దీని ప్రా
- ఫున ముద మొందు కెండలిరు బొడళపుందొర చూచు వారలన్
- వెనుకొని పూవుటంపరలఁ బెంపరలాఁడకు మన్నమానునే.154
శా. ఔనేకా మును పెన్నఁడో చెలియ చాయంజూచి నట్టయ్యెడున్
- గాన న్వచ్చె మదాలసావయవరేఖావైభవం బింత యే
- లా! నామానస మీలతాంగిపయి లీలాడోలికాకేళికా
- శ్రీనైపుణ్యముఁ జూపఁగా హవణుఁ గాంచెం దద్గుణాలంబమై.155
మ. వరభామాంగము మించుఁగా నితరముం బాటించకే మన్మనః
- స్థిరహంసం బది మానసంబు గనురీతిన్ నాతి నీక్షింపుచోఁ