ఈ పుట అచ్చుదిద్దబడ్డది
76
కువలయాశ్వచరిత్రము
- న్నిట మగుడించె భోగిపరిణీతరుణీఫణధోరణీననా
- ఘటితమణీగణీభవదకంపఘృణీతవియత్పిశంగమో
- త్కటఝఃరిణీసరోజమతికారి నమేరువనీరమారుతుల్.133
క. అవ్వనముఁ జేరి మవ్వవు, జవ్వనవున్ రాచకొమరుఁ జల్లనిమంచుం
- దువ్వరల నివ్వటిల్లెడు, పువ్వుంబొదరింట నునుచి భుజగకుమారుల్.134
క. ఇట నుండు మేము నీవ, చ్చుట యురగేంద్రునకుఁ దెల్పి శోభనలీలా
- ఘటనాపూర్వంబుగ ని, చ్చటి కేతెంచెద మటంచుఁ జనుటయు నతఁడున్.135
మ. వెలుఁగు ల్గాఁదగు మిన్నతీవియల ఠీవిన్ రాయు పన్నీటికా
- ల్వల తుంపుర్లకు మారు గాఁబలెఁ జలద్వాసంతికానూనని
- ర్మలమారందకణాళి జారి తనపై వ్రాలంగ రాయంచ ఱె
- క్కలు ఝాడించినఁ గ్రమ్ము తెమ్మెరల రాకన్ హాయి మంచు న్నెడన్.136
చ. హడపము వీణ కిన్నెర హిమాంబువు నించిన గిండిచల్వపా
- వడలుఁ గురంగనాభియు జవాదియుఁ దట్టుపునుంగు వీవనల్
- ముడి విరు లద్దముల్ సురటులుం దెలిదంతపు దువ్వెనల్ ముదం
- బడర ధరించి యూడిగపు టబ్బరపున్ వలిగుబ్బెతల్ దగన్.137
సీ. జిగిచాలు దగుకీలు చిగురాకునకు బ్రాఁకు కలికికోయిలలకుఁ కౌలు పనుప
- నేలగోవగలమోము తెలిదమ్మిఁగల తుమ్మెదలకు నమ్మిక కమ్ము లలవరింప
- నెఱికప్పుఁగను కొప్పుఁ నెరిమబ్బునకు నుబ్బు నెమలికిఁ ద్రోవబత్యముల ననుప
- నునుమోవిపైఠీవి మును బింబ నికురుంబముల కేఁగు రాచిల్క కొళవులియ్య
- లేనగవు డాలు కైదండ పూను చూపు, తళుకుచే మొక్కుఁగొనెడు ముత్యాలరెట్ట
- పేట పాపటబొట్టు తుంపిళ్ళు గుఱియ, నచటి కేతెంచె నొకచకోరాయతాక్షి.138
సీ. కావలిఁగనునింతి కానుకిచ్చినబంతిఁ గనుసన్న నొకకన్నె గైకొనంగ
- దెలిచూపు గమి తారసిలుచు నిల్చిన యంతఁ బడతులిద్దరు బరాబరులు సేయ
- నగుమోము జిగితమ్మి నిగుడు ఘర్మము గ్రమ్మి నంతుకై చెలువపావడలు దుడువ
- తొలఁగు బంగరురంగు జిలుగుపయ్యెదకొంగు సకియ యొక్కతె చక్క సవదరింప
- కట్టికమిటారిమొకరిచెల్కత్తెగములఁ, బొడఁ గనఁగఁ జేయ బంగారుపొంత మొఱుఁగు
- టరిగె గుంపులనీడ నొయ్యార మొసఁగ, వచ్చి పుప్పాపచయకేళి వాంఛ దేలి.139
క. మడమఁబడు నిడుదవాలిక, జడ నడుమున జుట్టి పైట సరిగె చెరంగుల్
- బెడఁగుఁ జనుదోయి పొడ లే, ర్పడ బిగియింపుచు ననుంగుఁపడతులు గొల్వన్140