ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము
75
క. ఆతీరునఁ బలుకఁగరా, దో తెలియదు గాని శౌర్యధూర్వహనీసం
- గాతముచే నీమన్ననఁ చేతం దొడితేరఁ బ్రతినఁ జేసితిమనుఁడున్.125
క. మాయురె తా రావలెనా, యాయెడకే నరుగుదెంతు నాయిల్లనఁగా
- నీయిల్లనఁగా వేఱా, వోయఁగ రా విట్టు లైన భువి సఖ్యంబుల్.126
మ. అనుచుం గట్టికయింతి దేవర పరాకయ్యా పరాకంచు బో
- రన మ్రోయన్ వలెవాటుదుప్పటిచెరం గల్లాడఁగాఁ జేఁగటా
- రిని లోభాగము నూఁది నిల్పఁదగు వారి న్నిల్పుచున్ మేలికుం
- దనపుంగద్దియ డిగ్గి నిల్చె నురగేంద్రక్ష్మా దిదృక్షారతిన్.127
చ. నిలచి పరావనీప రథి నీరధి మంథనమందరాద్రి య
- బ్బలియుఁడొకండ పాప దొరపట్టులు తెన్నెఱిఁగించుచుండఁ గా
- నలరుచుఁ నేఁగి కాంచె సికతాంచితతీరసమేతకేతకీ
- తిలకగచంచరీకసుదతీకృతగీతిక గోమతీనదిన్.128
చ. కనుఁగొని చిల్వరాచకవ గ్రక్కున నన్నదిఁ గ్రుంకఁ జేసి తో
- డ్కొని చనఁ నేఁగి చూచె ఫణకోటిమణీఘృణివేణికోర్ధ్వదీ
- పనికరభూత్రపాచరితపౌరుషకేళివిధూతరత్నరు
- గ్జనితనవస్మితాననభుజంగిక మొక్కపురంబు ముందరన్.129
చ. అచటి వియోగిభోగి జలజాక్షులు మారుని వ్రాసి కొల్చుచో
- నచలితభక్తిఁ జందురిని యంద మెఱుంగమి మున్ వసుంధరా
- రుచి గరుణావలోకులు నరుల్ చెలి నీ మొక మబ్జువంటిదన్
- వచనము లంతలోఁ దలఁచి వ్రాయుదు రున్ముకురాగ్రవీక్షలై.130
క. ఈకరణిఁ జూచి డిగు నా, భూకాంతున కొక్కయింపుఁ బొడమించెను ద
- ర్వీకర వైశాకర రు, చ్యాకర ముక్తానుషక్తహర్మ్యతలంబుల్.131
సీ. తీవయుయ్యెల లూఁగు పూవుఁబోఁడులవీఁగు కొప్పుచీఁకఁటిఁ డాఁగు కోర్కి యొకటి
- నునుపుట్ట చెండాడు వనితల యరవీడు జిలుగుపయ్యెదఁగూడు చెలువ మొకటి
- యలయంచ నదలించు చెలుల జంకెనమించు బెళుకుచూపులముంచు బెరికి యొకటి
- పూవుబంతులు రువ్వు పొలతుల తెలినవ్వు కలికివెన్నెలక్రొవ్వు గనుట యొకటి
- గాని మఱి యేమి వలదని కంకణంబు, గట్టుకొని నిల్చుపతిదృష్టి గ్రమ్మరించి
- చలిది గట్టించి త్రిప్పె నిస్తుల సువస్తు, నన్యసంతోషకరమగు నాగపురము.132
చ. ఇటువలెఁ జూచుచుం జను నరేశకుశేశయబాణుచూడ్కి న