ఈ పుట అచ్చుదిద్దబడ్డది
72
కువలయాశ్వచరిత్రము
- పేనలినాక్షికైనఁ గలదే కలరే యిటువంటి కామినుల్.97
సీ. గిలుకుబంగరుమట్టియలు జాఱఁగాఁ జక్కనలవరించెద నంచు నిలిచి నిలిచి
- బయట నున్నది చిల్క పంజరమున నుంచి మఱివచ్చెద నటంచు మరలి మరలి
- యతివ యల్లపుడేమి యంటివే యే చిరాకయియుంటిఁ దెల్పమం చడిగి యడిగి
- చెమటచేఁ దిలకంబు చెదరెనో యని వింతసొలపుతో నద్దంబు చూచి చూచి
- ప్రొద్దు గడపుట కని తోడి పూవుఁబోఁడు, లదరవైవంగఁ దనమందయానగరిమ
- యినుమడింప మదీయమోహనగృహంబుఁ, జేరు టెన్నఁడొ యానీలచికురనికర.98
శా. కైజా చేసిన బొండుమల్లె విరిబల్ఖండాజగాజోదు తే
- జీజాడం దలవాంచి బోఁటిచెఱఁగుం జేఁ గట్టిగాఁ జుట్టి ను
- న్గాజుం గంబముచాఁటున న్నిలిచి క్రేఁగంట న్ననుం జూచు నం
- భోజాతాక్షిని సెజ్జకుం దిగుచు నేర్పు ల్గల్గు నేమీఁదటన్.99
క. ఎక్కడి యాలోచన యిది, యక్కట యక్కలికి యున్నయపపటికిఁ గదా
- యిక్కోరికియని ననవి, ల్మొక్కలిదొరవిరిలకోరిమొనకుం దలఁకున్.100
సీ. పొడఁగననచ్చు నాప్తులవేళఁ గాదంచు నవసరంబులవార లడ్డగింపఁ
- బనిగల్గియుండినఁ దనకు మంత్రులకు లేఁజిగురుఁబోఁడులచేతఁ జీట్లు నడున
- నిదియేమొ కడువింత గదయంచు నవరోధబిసరుహాక్షులు గుసగుసలు వోవఁ
- గొలువుకూటమునందుఁ జెలఁగెడు సింగంపుగద్దియ గవిసెన గైకొనంగ
బొక్కసంబులు పెనుబీగములు భజింప, నుడిగములవారలకు నాటవిడుపు గాఁగ
- నోలమును మాని మేదినీయువతిజాని, యింత భావించు నంతఃపురాంతరమున.101
క. ఈ కరణి నన్నృపాగ్రణి, యేకరణీయములు మాని హిమకరవిలస
- ద్రాకలకు న్వలిదెమ్మెర, రాకలకుం జాలిగొని విరాళిఁ బడంగన్.102
ఉ. అతని నేస్తగాండ్రు భుజగాత్మజు లవ్వగలెల్లఁ గాంచి య
- య్యో తమవంటివార లిటు లుండియు నీదొర సీ దురంతచిం
- తాతనుతానితాంతహృదయవ్యధఁ గూఱఁగ నూరకున్న సం
- గాతులమౌదుమే యిపుడు గాక మఱెప్పటి కీవయస్యతల్.103
క. అని యయ్మిద్దఱఁ జని తమ, జనకుం డగు నశ్వతరుని సమ్ముఖమున నీ
- జనపాలు విరహవేదన, వినిపించి తదార్తి మాన్పవే యని వేఁడన్.104
చ. తనయుల స్నేహబాంధవవిధానము లెంచి నరేంద్రుఁ డంటిమా
- ఘనుఁ డటువంటివాని కుపకార మొనర్చినఁ గీర్తి చెందదే