ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము
71
- కాలువలకుం బ్రోదిసేయు జాదివిరిదేనియవాకవెంబడిం బాదుకొసన పోఁకమ్రాకు
- ల కట్టకడపట నెట్టుకొనిన యిందుకాంతవేదికాబృందంబులతోడి గురివిందపందిళ్ళ
- నొరసికొనియున్న తిన్నని మగఱాతివన్నియలఁ జెన్నగు చవికల నిముడుకొన్న క
- న్నెసురపొన్నగున్నలఁ బెనఁగొన్న నతిబియసజాతికి నాధారంబగు గొప్పకెంపు లు
- బ్బు చప్పరంబులం గప్పికొన గుజ్జుమావులక్రేవలఁ దమ్మితావులకుం దావులైన తెలి
- నీటికేళాకూళి నంటికొనిన యనంటులవలనం దొరఁగు కప్పురంపురవలుం బాఱు
- కొలువుకూటంబు డిగ్గిచను మెట్లడగ్గఱ నగ్గలంబగు నీలంబు నిగ్గులు గగ్గోలుపడు కో
- నపాదిరిం గౌఁగిలించిన పొగడగుంపుల నట్టనడుమఁ బట్టుగఁ పొదరిండ్లఁ జుట్టఁబ
- డియున్న బిత్తరం బగు క్రొత్తముత్తియంపుఁబడుకటింట నపరంజిగొలుసులం జెలం
- గు తూగుటుయ్యెలచేరునకుం జని యద్దనుజవీరుండు నిజాకారంబుతో నయ్యిద్ద
- రం దద్గృహంబున నునిచి యతిఘోరాకారులగు దైతేయభామలం గాపువెట్టి కృత
- కృత్యునింగాఁ దలంచుకొని యాక్షణంబున.92
చ. మునుపటిసారి కాంక్షి విధముం భజియించుచు నంబుజాకరె
- బునఁ బడి తేలి యోనృపతిపుంగవ నీభుజసారగౌరవం
- బున జప మెల్లఁ దీఱెఁ బొలివొవక నీవిఁకఁ బట్టనస్థలం
- బునకయి పొమ్ము రాజునకుఁ బోలునె యాశ్రమవాసఖిన్ననల్.93
చ. అని యనుపన్ హసాదని నృసాగ్రణి యమ్మునిలోకచంద్రు వీ
- డ్కొని తన తేజి నెక్కి గిరికోటులుఁ గాననవాటులు న్మహా
- జనపదము ల్నదంబులును జయ్యన దాఁటి పురంబుఁ జేరి కాం
- చనసముదారమై తగుహజారమునం దమవారు చేరఁగన్.94
క. తురగంబు డిగ్గి యచ్చటి, పరిజనుల న్వీడుకొల్పి పార్థివచంద్రుం
- డరిఁగి గృహాంతరమునఁ ద, త్తరుణీమణి లేమి నద్భుతనిమగ్నుండై.95
ఉ. అక్కట యెందు వోయెనొ యొయారపుసంచులముద్దుగుమ్మ యే
- చక్కిని దాఁ గెనో కలికి చక్కవలెక్కువగుబ్బలాడి యే
- దిక్కున నున్నదో సొలపు దేఱెడి చూపుల హొంతకారి యే
- యిక్కన నిల్చెనో యొరపు నీనెడు చిల్కలకొల్కి దైవమా.96
ఉ. ఆనడ లామెఱుంగుఁదొడ లాకడగంటన చూచుసోయగం
- బానెరు లామిటారికరు లామురిపంబునఁ బల్కుపాటనం
- బానొస లామొగంబుపస లాతెలిపయ్యెద చక్కఁజేర్చుసొం