ఈ పుట అచ్చుదిద్దబడ్డది
70
కువలయాశ్వచరిత్రము
- ముమ్మరపుఁబుప్పొడుల్ నెమ్మి గ్రుమ్మరించు, తెమ్మెరలు గ్రమ్ము కమలాకరమ్ముఁ జేర్చి.84
గీ. అధిప నీ విందు వచ్చిన యపుడ తొలఁగె, రక్కసులమాయ పద్మాకరంబునందు
- వరుణజప మొనరించి యే వచ్చుదనుక , నిచట నుండంగవలయు నీ వేమి యనక.85
గీ. అయ్య నిను నమ్మఁగూడ దే నరుగుదేరఁ, దామసంబైన జరగెద వేమొ నీవు
- కాకయుండిన నిమ్ము నీకంఠహార, మిప్సు డన' చిన్నినవ్వుతో నిచ్చుటయును.86
క. జలదేవతకుం బ్రాంజలి, సలుపుచు నక్కొలన మునిఁగి జనపతి నగర
- స్థలమున నంతిపురంబున, నలరుం బొదచెంత డిగ్గియం దేలుటయున్.87
గీ. కుండలియుఁ దాను నవ్వుచుఁ గూడియున్న, యమ్మదాలసఁ గని మంత్రియంద మొంది
- యమ్మ మనరాజు మౌని యాగమ్ము గాచె, రక్కసులఁ దోలి భుజబలప్రాభవమున.88
ఉ. అమ్ముని యంత సంతసము నంది యనిందితకార్యధుర్యరూ
- ఢమ్ముగ నీవివాహ మచటం జరగింపఁగఁ గోర్కె వేడ్క యీ
- యిమ్మునఁ బట్టనంబు రచియించెద నాదు తపోబలంబునం
- గొమ్మను బిల్వ బంపు మిటకు న్మఱుమాటలు పల్క కేమియున్.89
గీ. అనిన మాఱాడ వెఱచి యమ్మనుజనాథుఁ, డానవాలుగ నీకంఠహార మిచ్చి
- నిన్ను వేవేగఁ దోడి తెమ్మన్న వచ్చి, నాఁడ రావమ్మ కుండలతోడఁ గూడి.90
మ. అని యామౌక్తికహార మిచ్చుటయు సాంద్రానందముం బొంది మా
- నిని మేకోలునఁ గుండలావదనము న్వీక్షింప నయ్యంబుజా
- నన కానిమ్మని పల్కఁ గృత్రిమవిమానం బెక్కఁగాఁ జేసి య
- ద్దనుజాధీశుఁడు తా నదృశ్యుఁడయి చెంతంబోయె సంతుష్టుఁ డై.91
వ. అత్తఱిం దటిత్తరుణభానువిరాజమానం బగు నమ్మాయావిమానంబు జలయంత్రంబు ను
- పమఁబ్రవేశంబునకుం గమకించు నందకంబురకంబునఁ బొడవుగా నెగిరి యొక్క
- పరిరథంబువిధంబున మందగతిం జనుచు నొక్కసారి లకోరిదారి రివ్వున నిగుడు
- చు నొక్కతేప బొంగరంబు రంగున బిఱబిఱం దిరుగుచు నొక్కమాటు గాలిప
- టంబునీటున నసియాడుచు నొక్కయెడఁ జుక్క తెగిపడ్డవిధంబున డిగ్గుచు నొ
- క్కచోటం బుట్టచెండు వడువున నుప్పరంబునకుం బోవుచు నొక్కవంక జీనుది.
- గవైచిన కప్పలి చొప్పునఁ గదలక నిల్చుచు నొక్కపరి బైరిడేగ యొయారంబునం ది
- ర్యక్ప్రచారంబుఁ జూపుచుఁ బోయి మేరుధారుణీధరంబున నిబిడాంధకారబంధు
- రం బగునొక్కబిలంబున దమాలతాలతక్కోలరసాలసాలముఖసాలవిశాలం బగు
- వనంబునం బునఃపునర్వర్ధమానగిరిఝరీవితానంబులకు నుబ్బు గన్పించు పన్నీటిపిల్ల