ఈ పుట అచ్చుదిద్దబడ్డది
68
కువలయాశ్వచరిత్రము
- బేరుకొని వేఁడుమన్నాఁ, డారమణుల నొప్పగింపు మటుగాకున్నన్.67
సీ. అలవాటు చేసికొ మ్మఖిలమరుత్పాలకులఁ గూడికొని నిల్వుకొల్వునకును
- నభ్యసింపఁగఁ జేయు మలజయంతునకు వేళ యెఱింగి వెండికాలాచి దాల్ప
- దారికిఁ దెచ్చుకొ మ్మారూఢిఁ బౌలోమి సైరంధ్రికాసదాచారమునకు
- నలవడఁగా నేర్పు మచ్చరలకు మాఱువలుకని బానిసపాటులకును
- దలఁప కమృతంబు వైజయంతంబు మఱవు, విడువు వజ్రాయుధముతో డీగొడవ యింక
- నిచట నుండక వెడలిర మ్మిపుడు దేవ, పట్టనం బేను దోరణకట్టినాఁడ.68
క. అని నీల్గు నన్నుఁ దప్పకఁ, గనుఁగొనలం గొప్పనిప్పుకలు కుప్పలుగాఁ
- గనుఁగొను ప్రథమకకుత్పతిఁ, గని దేవగురుండు రోషకలుషేక్షణుఁడై.69
క. ఓరీ మీదొర గోరిన, తారారంభల విటావతంసులచేతన్
- మీరజనీచరుఁ డగ్రజుఁ, జేరం జనుఁగాక యని వచించుచు నలుకన్.70
గీ. వీని వెడలంగఁ ద్రోయుఁ డివ్వీటిగోట, దాఁటునందాఁక ననుమాట నోటనుండ
- నీటు వోమీటి గరువంబు మాటి యిటకుఁ, బెద్దపర్వున వచ్చితి బెదరువుట్టి.71
క. ధారాధరవాహను గ, ర్వారూఢియు గురునిశాప మటులుండెఁ గదా
- మీరజనీచరుఁ డగ్రజుఁ, జేరం జనుగాక యనుటఁ జెందితి వగలన్.72
క. పాతాళకేతుఁ డాదృఢ, దైతేయుఁడు వీరుఁ డమ్మదాలసకొఱకై
- యేతెఱఁగున నేమయ్యెనొ, కో తెలియదటంచుఁ దెలిసికొను నట్టియెడన్.73
గీ. ఆరీతి ఘటిల్లఁ గొందఱు చారవరులు, వచ్చినతి సల్పి కువలయాశ్వక్షితీంద్రు
- చేతనైనట్టి పాతాళకేతు పాటు, తోఁపఁదెల్పినఁ దాళకేతుండు కనలి.74
చ. ఒదవినశోక మాచికొని యుగ్రతరాగ్రహకేళికావశుం
- వదుఁడయి యింద్రు గెల్చుటకు వచ్చిన నే మటుమీఁదఁగాదె నేఁ
- డదయత నన్నరేంద్రుఁడు మదాలసకై కద భాసమానదో
- ర్మదుని మదగ్రజుం బిలుకుమార్చెను దాని హరింతు నిత్తఱిన్.75
గీ. కపటమునఁ దెత్తు నాహంసగమన నది యె, ఱింగి మార్కొన్న నాతని భంగపఱతుఁ
- బగయడంపకయున్న నీపగిది నెగులు, సైఁచవచ్చునె యిదియ నిశ్చయ మటంచు.76
సీ. ఎదురిండ్లు ఫలుసాల లెనసి వర్ణింపఁజాలిన మేలిపర్ణశాలికలు కొన్ని
- యాగమాతంబుల యందలి యర్థము బ్రకటించు కీరశారికలు కొన్ని
- హవిరన్నసంభ్రమద్దివిజకోలాహలాంకములైన యాగవాటములు కొన్ని
- దున్ని విత్తక పుట్టి యెన్నులవ్రేఁగున వ్రాలు నివ్వరిప్రాలచేలు కొన్ని