ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము
67
చ. కొలువున నుండి యింద్రుకడకు న్మన మంపినవాఁడు వచ్చెనా
- పిలువు మటన్న వేత్రధరబృందము తోకొనితెచ్చి ముంగల
- న్నిలిపిన వాఁడు భీతియు వినీతియుఁ దోఁప దురాపకోపచా
- పలమున హుంకరించు నిజభర్తకుఁ గేలు మొగిడ్చి యిట్లునున్.59
క. దేవరప్రతాపగరిమకు, నే వెఱతుం గాని నిర్జరేంద్రుఁడు వెఱవం
- డావంతయైన నిపు డే, మోవింతలు పుట్టె దనుజమూర్ధన్యమణీ.60
సీ. దొర కాప్తులై కార్యసరణిఁ దెల్పెడి కవీశ్వరులకు లంచపంచంబు లొసఁగి
- సమ్ముఖమ్ముననుండి చను దెంచు నలవ్రాయసమువారి కాశపాశలు ఘటించి
- బోనవెచ్చము గొంచుఁబోవు శచీదేవిదారులకును బరిధాన మిచ్చి
- పిలువ నేతెంచు వేగులవారివెంట నే యరుగు నియోగుల ననుసరించి
- కినిసి వాకిటివా రడ్డగించుకతన, నేను వచ్చినమాట దేవేంద్రుతోడఁ
- డెలుపు మని యెంత వేఁడినఁ దెలుపరైరి, విని వినమి చేసెనో కాని వేల్పుఱేడు.61
క. మనగురు వఁట నే వచ్చుట, వినెనేమో గ్రుడ్డికంటి వేలుపుదొరతో
- వినిపించి యతనియనుమతి, ననుఁ గొని చని సమ్ముఖమ్మున న్నిలుపుటయున్.62
సీ. ననుఁ గని పాట నిల్పిన తుంబురుని జూచి యాతాన మీసారి యనుమటంచుఁ
- గమలజోద్భవసుమాళము చెందినాఁడవు వింతవార్త లు గలవే యటంచు
- నీతని నంపరాదే యంచు సన్నగాఁ దెల్ప వారలను గద్దించుకొనుచుఁ
- గ్రేఁగంటఁ బల్కనుంకించు నన్గని పట్టుగద్దిగ లెస్సాయెగా యటంచు
- సడ్డ సేయక నిరుపమైశ్వర్యగర్వ, పటిమ పడఁతులు జలకంబు పట్టియున్న
- దనఁగఁ గట్టిక వారిండ్లకనిపికొండ, యంచఱు నటంచు మ్రోయ నయ్యవసరమున.63
గీ. మనగురుఁడు చేరి ననుఁ జూపి మనవి గాఁగ
- నితని వీడ్కొల్పుఁ డన్న దేవేంద్రుఁ డొద్ద
- నున్న గీష్పతిఁ గని కనుసన్న సేయ
- నతఁడు నాదిక్కుఁ జూచి యనాదరమున.64
క. ఏమోయి తాళకేతుం, డేమని పంపించె నిర్జరేంద్రునికడ కు
- ద్దామక్షేమాహతసాం, గ్రామికుఁ డాతనికి శుభమో కద యని పలుకన్.65
గీ. చుఱచుఱను జూచి దొర నిన్నుఁ జూచువాఁడు, నంతలోననె నీవు న న్నడుగువాఁడ
- వాబలా పొట్టక్రొవ్వుగా కంచు నేను, గోత్రపరిపంథితోఁ గొంకుకొసరు లేక.66
క. తారారంభలు చక్కని, వా రనఁగా మెచ్చి దనుజువల్లభుఁడు నినుం