ఈ పుట అచ్చుదిద్దబడ్డది
4
కువలయాశ్వచరిత్రము
- దాఁటు తేఁటిదాఁటులనీటు వాటించు వలభికానీలజూలంబుల నీడలకుం దోడుపడు
- సాంబ్రాణిధూపపుంజంబు లనుచీఁకటికై యుదయించు మంచురాయని రేకలపో
- కలందగు మగఱాతిబోదియలం జెలంగి ముంగల నాడు కీలుబొమ్మలకోలాటంబు
- రొదలకును గివకివకివఁగూయు కోయిలలయారజంబులకును నొండొరులమొగంబు
- లు చూచికొను నూడిగంపుఁజేడియల మందహాసరుచికందంబులకు విందులు గావిం
- చు ముక్తామయస్తంభంబులందగు తమయాకారంబులం గనుంగొని తోడినియోగుల
- ని రాజకార్యబు లడుగునానాదిగంతరానేకవజీరామాత్యులం బిలుచు సౌవిదల్ల
- సాహోనినాదంబులకుఁ బ్రోదిగావించు వందిజనంబుల కైవారంబుల నడుమ వినంబ
- డు నంగనాంగీకృతసంగీతంబు లగు నానందబాష్పబిందుసందోహంబుఁ జిందించుచం
- దంబునఁ దొరఁగు వితానీకృతవివిధప్రసవవిసరరసప్రసారంబునం బొసంగు నా
- స్థానంబున మణిమయాసనంబున సుఖాసీనుండై నిండోలగం బుండుసమయంబున.17
క. వినయమున నేను గదియం, జని యేతత్కువలయాశ్వచరితంబు ముదం
- బున మీకు నంకితముగా, నొనరించెద ననిన హర్షయుక్తుం డగుచున్.18
వ. ప్రసాదమందస్మితకటాక్షంబుల నిరీక్షించినఁ దదీయాంగీకారం బెఱింగి ప్రబంధని
- బంధనోత్సాహబంధురుండనై తన్ముఖాలంకారంబుగాఁ గృశిపతివంశావతారం బ
- భివర్ణించెద.19
సీ. నెలఁతలనెఱముద్దునెమ్మోవినీటుదార్కొన్నవానికి జోడుకోడె యనుచు
- జనరాండ్రజిగిగుబ్బజగపోల్కిఁ జనుపిట్టకవలకెల్లను జెల్మికాఁ డటంచు
- లేమగుంపుల లివలివలాడు లేఁగౌనునంటిచోటికి నెలవరి యటంచుఁ
- గలికిమిన్నలకల్కికంటికో పెనయు మెచ్చులక్రొవ్విరికి మేలిచుట్ట మనుచు
- నెంచి ఛాయాశుభాంగి యేయినుని మౌళి, నిండువేడుకఁ దలఁబ్రాలు నించి వెలసె
- నతఁడు కనకాద్రివలనాప్రయాణనిపుణ, సైంధవుం డెన్నఁదగు లోకబాంధవుండు.20
క. ఆతనికులమున దశరథ, నేత దగు న్శరధిపరిధినిఖిలమహీర
- క్షాతత్పరుఁ డాతనికి, న్సీతాశాతోదరీమణీపతి వొడమెన్.21
శా. ఆరామాధిపమౌళికిం దశముఖాఖ్యగ్రావదంభోళిన్
- బారావారపటీసమావృతకటీభారోజ్జ్వలద్ధారుణీ
- ధౌరంధర్యసరీసృపార్యసమదోస్తంభప్రతాపప్రభా
- శ్రీరాజద్దిశుఁ డౌకుశుండు జనియించెం బ్రాభవోపేతుఁడై.22
గీ. ఆకుశుని యన్వయమున బాహాసహాయ, శౌర్యగాంగేయ వైరిరాజన్యగేయ