ఈ పుట అచ్చుదిద్దబడ్డది
66
కువలయాశ్వచరిత్రము
- డానతి నాకుఁ బోఁటియయి యప్పుడె యప్పని నేర్పకుండునే.50
సీ. రాచిల్క రాయబారమున దారికి రాక చడ్డింపు కోరమీసములు దువ్వి
- యదిగా దనుచు నింతటంతటఁ జేరరాఁ గేడింప బిట్టుగాఁ గేక వైచి
- నీ బంట నన్ను మన్నించవే యన వివి వినమి సేయుచు దుంటవిల్లు వంచి
- దుడుకుగాఁ జెఱగంట ముడిగొన్న బొమ్మ లానించి చూచిన తెగనిండఁ దీసి
- యతనుఁ డీయింతి కలుక చల్లార్ప నీవు, పాదముల వ్రాల దీనబాష్పములు చూచి
- యస్త్రసన్న్యాస మొనరించునట్లు గాఁగ, నింపు సొంపొరఁగా విహరింపుఁ డింక.51
గీ. అనిన ముదమంది యమ్మందరాద్రి ధీరుఁ, డావధూటులఁ దోడ్కొని యాత్మపురికి
- నరుగుటయ కాని లేదు కార్యం బటంచు, నగవు దైవాఱఁ గుండలమొగము చూచి.52
క. మంచిది మనపురిఁ జేరుద, మంచు న్లేచుటయు నవ్వయస్యయుఁ గమ్మల్
- మించుగ నసియాడఁగ బదుఁ, డంచుం జేఁ జూపి మందహాసముతోడన్.53
చ. చెలువుని వెంటఁబోఁ దరువుసేయు మనోబ్జము మాట చెల్లనీ
- కలమెడు లజ్జకన్న ఘనమైన కటీతటి వ్రేఁగున న్నడ
- ల్బెళకఁగ నంచబిత్తరివలె న్మురిపంబున నమ్మదాలసా
- జలరుహగంధి రా నృపతిచంద్రుని వెంబడి మేడ డిగ్గినన్.54
మ. అతఁ డచ్చోఁ దురగంబు నెక్కి హృదయాబ్జాపూర్ణమోదార్ణవాం
- చితుఁడై వారల వెన్క నుంచుకొని యక్షీణైక్యమాణిక్యదీ
- ధితిజాతానృతదిగ్వితాన మగు దైతేయాధినాథాయతా
- యతనం బల్లన నిర్గమించి పురబాహ్యక్షోణి కేతెంచుచున్.55
ఉ. అచ్చట నున్నసైన్యము బలాధిపతు ల్వెనువెంటరా సము
- ద్యచ్చటులారభటిం గువలయాశ్వము ధేయని చౌకు చేసినన్
- బ్రోచ్చలితావనీరజము లొక్కమొగంబుగఁ బిక్కటిల్లి వై
- యచ్చరవీథిఁ గప్ప నది యాత్మపురాంగణసీమఁ జేరినన్.56
గీ. అచటి కెదురుగవచ్చు ధరాధిపతులు, కామినీయుక్తుఁ డై చేరు క్రమ మెఱింగి
- దవ్వులనె నిల్వ నిజమణిధామ మొంది, రమణులును దాను నంతఃపురమున కరిగె.57
ఉ. అంతట నాసురాంతకుని యర్మిలితమ్ముఁడు తాళకేతుఁ డ
- త్యంతమహాగుహాముఖకహాకహనాదమహాట్టహాసవి
- భ్రాంతసమీకశోకపరిపాకభయాకరణైకలోకదు
- ర్దాంతవిరక్తనోదరగదాశ్రితకేశవుఁ డొక్కయిమ్మునన్.58