ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము
65
- యమానమానసనై యున్నదానఁగాని నీయందలి సౌందర్యగాంభీర్యాదిగుణంబులు
- సోయంప్రతృభిజ్ఞావిధాయకంబులై యున్నయవి, అయినను మద్విలోచనచకోరికా
- చంద్రబింబంబగు నీమూర్తియుం బోలె యుష్మద్వృత్తాంతంబుఁ గూడ మన్మనః
- కమలంబునకు మార్తాండమండలంబుగా నానతీయ నవధరింపుము.43
చ. అన విని యాజనాననగుణావని యావనితాశిరమణిం
- గనుఁగొని యింత నేర్పరివి గాకయ యుండిన నీవధూటి కిం
- పెనయ వయస్య వొదువె భళీ యిటు వచ్చెను రాక్షసాధముం
- దునుము ఋతధ్వజుం డనవుడున్ భవదూహకుఁ దప్పు గల్గునే.44
క. నాకోరికతో నీక, న్యాకాంక్షిత మెల్ల సఫల మయ్యెం దివిష
- ద్భీకరుఁ డీదనుజుఁడు ఘో, రాకారతఁ గూలె మచ్ఛరావళిచేతన్.45
గీ. అదియు నెఱుఁగుదు వింక నేణాంకనదన, మంజువాణియు నేను నీమాటలోని
- వార మైతిమి మాకు నేదారి నడువ, వలయునో యట్లు నడిపింపు పలుకు లేల.46
చ. అనవుడు నమ్మదాలస ముఖాబ్జమునం జిఱునవ్వువెన్నెలల్
- నునుఁజనుఁదోయిపైఁ బులకలున్ నిటలంబున ఘర్మబిందువుల్
- మనమున సిగ్గుఁ గన్నుఁగొనలం బ్రవహించు ముదశ్రుపూరముల్
- కనఁబడ నున్నఁ జూచి చెలికత్తియ యత్తఱి రాజచంద్రుతోన్.47
చ. ఇపుడు గదా మదాళి పయి నెత్తిన వింటిపయిం జెలంగు నం
- దపువిరిదమ్మిఱేకు దెస నా దొరకేల్ రతి నిబ్బరంపు సి
- బ్బపు నలిగబ్బిగుబ్బకవపై జెరలాడఁ దొడంగె నేఁడు మా
- తపము ఫలించె నింక వసుధావర తామస మేటి కియ్యెడన్.48
సీ. వేఁడిసెగల్గల్గువేల్పు సాకిరియైన యప్పుడు గాని కేలంటరాదు
- ప్రామిన్కురొదలు గన్పడఁ గంటెకట్టునప్పుడుగాని గళయుక్తిఁ బొందరాచు
- పొలుపుగా వ్రేలిమి బొట్టమరించునప్పుడుగాని ముంగురుల్ పొదువరాదు
- మొక మోరసేయ సన్నికలు మెట్టించునప్పుడుగాని పాదాప్ఁ బొరయరాదు
- నృపదంపతులకు విడెమిచ్చుమోద, మెనయునప్పుడుగాని పాన్పెక్కరాదు
- నీ వెఱుంగవె శాస్తోక్తి నిర్ణయప్ర, చారము లుదారకుంభినీజంభవైరి.49
ఉ. ఏను వచింప నీవు విను టిప్పుడకా యిఁకమీఁద నీసరో
- జానన యొక్కవేళఁ బొలయల్కఁ బరాకున నున్నయప్పుడే
- మో ననుఁ బిల్తు పెద్దతనముం గనినప్పటికైన నీదుపా