ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కువలయాశ్వచరిత్రము
62
- చ్చులకుచ్చుఁ బట్టివైచిన, వెలిపావడ యనఁగఁ దూర్పు వెలుకం బాఱెన్.15
సీ. తనభానుసంతతి ధరమీఁద వెలయింప భువిఁ గాధిపతి గురస్ఫురణఁ బెంప
- రహిఁ బాదమహిమచే ఱాతినారి నొనర్ప నభవోగ్రధర్మ మొప్పారఁజేయ
- మానితధరణిజాతానంద మొనరింపఁ బాంథరామాత్మదర్పంబు లడఁప
- వనభూరికమలవర్గస్ఫూర్తి మాయింపఁ దారేశరూఢివర్ధన మొనర్పఁ
- దేనెరాయనిగర్వంబు గానుపింప, సమధికపలాశపరచక్రసమితి నొంచ
- నమితకువలయపరిపాలనమున మెలఁగఁ, దూర్పుదెస రామచంద్రుఁడు తోఁచె నపుడు.16
గీ. ప్రాగ్దిశాంగన కెంగేలఁ బట్టినట్టి, పురుతకాలపట్టుగవిసెన పొదువు వలన
- నందమొందెి నిద్దంపుటద్ద మనఁగఁ, బొడుపుఁగెంపున జాబిల్లి పొడిచె నపుడు.17
చ. అమలిన శుక్లపక్ష మెనయందగు తద్విజరాజు మించి భే
- దము సవరించి తేర్చు తెలితల్కులపాలనఁ బాంథదేహపాం
- డిమబలెఁ జంద్రిక ల్నిగిడె డించిన నీరనఁ గాముకాత్మమో
- హమువలె నంధకారనివహం బది యెక్కడనో యడంగఁగన్.18
క. ఆకరణిఁ బొలుచు హృదయ, వ్యాకులతాతాపకారి యగు కోకారిం
- జేకూరిన వగ వేలుపు, రాకూరిమిపట్టి యబ్బరంబుగఁ బలికెన్.19
మ. నెనరొందం ద్విజరాజుగా యితఁడు పోనీ యంచు నే నూరకుం
- డిన నీ వెంచక యేతువే యిటులఁ గానీ మంచిదే చంద్ర నా
- నునువాలుంజడ చిల్వరాయనికి నిన్ను న్మేఁత గావింతురా
- వినురా యేటి పరాకురా కుసుముధన్విం గూడి వే రాకురా.20
గీ. అమృతరామకమండలు హరిణకృత్తి, కాసమన్వితు నుద్దండకరుని నిన్ను
- గన్న సన్న్యాసిగతి దోఁచుచున్న దరయ, గగనమధ్యాభియుక్తి నీ కగునె చంద్ర.21
గీ. శరధిఁ దోచుఁట నాళీకపరవిధంబు, గోరి కాంచుటయును మ్రోయుగుణము గల్గు
- వింటనంటుట మమ్మేఁచుచుంట తెలిసె, నేయువారలఁ గానమో తోయజారి.22
క. నళినాప్తువలన మండల, కలితుఁడవై వెలయుటెల్లఁ గలిగిన కరణిం
- దలఁతువె శంబరహారికిఁ, గలదే యుపకార మెందుఁ గమలకులారీ.23
సీ. నినుఁ గడుపారఁ గాంచినవారిరాశికిఁ గడలేనిపాటులు గాంచవలసె
- నిను నారికోరి కైకొను కల్వచెల్వకు విషములో బ్రతుకుఁ గావింపవలసె
- నినుఁ దలమీఁదఁ దాల్చిన శూలపాణికి నవిభవోపేతుఁడై యమరవలసె
- నిను నమ్మి కొల్చి నిల్చిన తారకాళికిఁ జింతింప దుఃఖంబు చెందవలసె