ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చతుర్థాశ్వాసము
61
చ. అవిరళనిర్గళన్మధురసాగ్రనిబద్ధ నిజానుబింబకై
- తవమున హేళి కాలవశత న్నిజపద్మగృహంబుఁ జేర మా
- ధవపదచ మౌటచే రమ మచభ్రమరాళితమంబు వాని వెం
- దవులకయుండఁగాఁ దలుపు దార్చె నన న్ముకుళించెఁ బద్మముల్.8
ఉ. ఏకరథాంగభావము వహించిన నన్నిటు డించి పోవుట
- ల్నీ కుచితంబు గా దయిన నీవలె నేనును నీరధిప్రవే
- శాకలనంబు గాంతు నను నాకృతి భానుని దేఱిచూచుచుం
- గోకము బాష్పనార్థి సమకొల్పె భవిష్యదయోగఖిన్నమై.9
ఉ. ఎంతయు బాడబంబు తనయింటికడం జెలువొందు జీవనం
- బంతయుఁ గొల్లలాడ భువనావనశాలివి నీవుపేక్ష గ
- న్పింతువె యంచుఁ బాశి మొఱ వెట్టగఁ జక్రము దానిపై రమా
- కాంతుఁడు వైచెనో యన వికర్తనుఁ డయ్యెడఁ గ్రుంకె వార్ధిలోన్.10
చ. కరముల బల్మిచే మెఱయు కంజహితుం డను మేటిజెట్టితో
- నరుదుగఁ బోరిపోరి సమయప్రతిమల్లకులేంద్రుఁ డాతనిన్
- హరువుగఁ ద్రోచి మేనిచెమ టారఁగఁ దాల్చిన యెఱ్ఱమట్టినా
- గరమమరెం బ్రవాళరుచిగంధధురంధరసాంధ్యరాగముల్.11
సీ. రవిగ్రుంక ముకుళించు రాజీవములఁ బాసి గమిగూడు తుమ్మెదకదు పనంగ
- విభునిఁ గానక భూమి వెదుక నేతెంచి చొప్పుడు చాయ విశ్వరూపం బనంగఁ
- దొగనంటు సోమాఖ్య నెగడి రాఁగలఁడంచు గుమిగొన్న తామసగుణ మనంగ
- రేకొమ్మ పతిరాక కైకొప్పు ఘటియింపఁ గొనవిప్పు కురులడా ల్గుం పనంగ
- కాముకాగమనప్రతీక్షాపరాయ, ణోత్పలాక్షీజనాంజనవ్యూఢవిసృమ
- రాయతాక్షీణనవవీక్షణౌఘ మనఁగఁ, దండిచీఁకటితండంబు మెండుకొనియె.12
సీ. నటదుగ్రఢక్కానినాదభిన్నాంతరిక్షమునఁ దాల్చిన వెండిక ట్లనంగ
- జవమందమందగంధవహాప్తి మింటిపై రాలు వేలుపుమ్రానిపూ లనంగ
- యామినీవిధువివాహమున కంబరవేది వరలు ముత్తెపురంగవల్లు లనఁగఁ
- దమపుష్కరాభిఖ్యతథ్యంబకా వియత్పథము చెందిన వెల్లదమ్ము లనఁగ
- సమయమనుయాత్ర నాళీకసార్వభౌముఁ, డంబుజంబులఁ జెందురోలంబపఙ్క్తి
- యనుతుపాకిని గగనలక్ష్యంబు వైవఁ, దగులు సీసంపుగుండ్లునాఁ దార లమ రె.13
క. అలపొడుపుగట్టు నగరు, న్వెలువడురాజునకు మ్రోల వేళాసతి మె