ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము
59
సీ. తనులతమీఁద జివ్వున నింకి మిహికాంబుకాండ మెంతయు నిరాకార మయ్యె
- నఱచేతిపైఁ జుఱచుఱ స్రుక్కి యందందఁ గెందమ్మి పుష్కరాకృతి వహించెఁ
- గలికి కన్నులమీఁదఁ గమలిన పరువంపు ననగుత్తు లయ సూనంబు లయ్యె
- మినుకుఁ జందోయిపైఁ దునిసి మౌక్తికరాశి తిలకింప ముత్తెంపుతెరలు వూనె
- బళిర యివియెల్లఁ దమపాటు దలఁప కిప్పు, డంగజాగ్నికి సాహాయ్య మాచరించి
- కొమ్మ పై వేఁడి చూపె నాకమ్మవింటి, యెమ్మెకానికి విజయకాలమ్ము సుమ్ము.159
గీ. అదియుఁ గా కిందుఁ జనుదెంచునపుడు తమ్మి, విరుల దగుకమ్మదెమ్మెరల్ వీచెనమ్మ
- గైకొనక వచ్చినంతయుఁ గంటిమమ్మ, యబల నిం దుండనీయరా దమ్మ యనుచు.160
క. ఇందీవరలోచన లిం, దిందిరకచ సేద దీర్చి తెచ్చిరి సుషమా
- కందలితైందవరుచిగరి, మందిరమగు ధవళవసనమందిరమునకున్.161
గీ. ఇట్లు చెలువలు దోడ్కొని యేగుదేర, నంబుజానన తనగుడారంబుఁ జేరె
- ననిన జైమినిముని యావిహంగములన, నంతర కథావిధం బెట్టిదని యడిగిన.162
శా. లక్ష్మీశోపమ వీరవేంకటనృపాలశ్రీమహారాయ ద
- త్తక్ష్మామండల మండనాయిత యశోదామాభిరామాంశునీ
- రక్ష్మావర్తన కార్తికీకుముదినీప్రాణేశ చారుప్రకా
- శక్ష్మీలత్ప్రతిపక్షభూమిపతియోషాలోచనాంభోరుహా.163
క. ధాటీఘాటీఖరఖుర, కోటీపాటితవిరోధికుతలపతిశిరః
- కోటీరహారశకలవ, ధూటీనవమదన విభవధూర్వహసదనా.164
పంచచామరము
- వచావదాహిభోగిరత్న వర్ణవర్ణితక్షమాం, గదాగదాసిమద్విరోధిఖండనాత్తలోకస
- మ్మదా మదావళారివిక్రమస్ఫురదృశఃకలా, పదాపదానవద్రులోకపారిజాతవైభవా.
గద్య
ఇది శీమన్మదనగోపాలకటాక్షవీక్షణాసమాసాదిత సరసకవితావైభవ సవరమన్వయా
- భరణ నారాయణభూపాలతనూభవ శఠగోపతాపసేంద్రచరణారవింద సంచలన్మా
- నసమిళింద సంతతభారతభాగవతాదిశ్రవణానంద కామినీమనోహర రూపరేఖావిజి
- తచైత్ర కాశ్యపగోత్రపవిత్ర జాతివార్తాకవిజనామోదసంధాయక చిననారాయణనా
- యకప్రణీతంబైన కువలయాశ్వచరిత్రంబను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.