ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము
57
- క్కుటిలకచాశిఖామణికిఁ గోరుకులిచ్చు రమాకుమారు నె
- క్కటి భజియింపకున్న నిది కార్యముగా దని యేగి యవ్వలన్.144
వ. చెలువగు పూఁబొద న్వలపు చల్లెడు కస్తురితిన్నెయందుఁ గెం
- దలిరుపరంగిపీఁటపయిఁ దామరఱేకునఁ జెంతనున్న నె
- చ్చెలి మొగ మోరసేయ రతి చెక్కులు నొక్కుచు మోవి యానుచున్
- గలరవ మిచ్చు పచ్చవిలుకాని లిఖించి సఖీశిఖామణుల్.145
చ. అలిగిన మ్రొక్కి చుక్కజవరా లదలించుచుఁ గాలఁ దన్నినం
- బులకలు దాల్చు చందురుని పొంకము వ్రాసి వసంతు మత్తకో
- కిలములఁ దేఁటులం జిలుకగేస్తుఁ దెమ్మెరయాకతాయలన్
- నిలిపి యమర్చి తెచ్చిన వనీకుసుమంబులు కుప్పవోయుచున్.146
క. పూజించి చిలుక ముష్కీ, తేజీదొరఁ గూర్చి వికచదీవ్యద్గంగా
- రాజీవ నవమధుద్రవ, రాజీవరవైఖరీపరంపర దొరయన్.147
మ. హిమరుగ్భాంధవ మంత్రరహీనము క్రియాహీనంబు సద్భక్తిహీ
- నము మత్కల్పితమైన యీనిఖలనానాసూనపూజావిధా
- నము సంపూర్ణముగాఁ దలంచి దయ నానందింపు నీవంటి దై
- వము చిత్తంబున మెచ్చినం గలుగలేవా మన్మనోభీష్టముల్.148
గీ. అరయ హరునంతవాఁడు త్వద్గురుశరాగ్ర, దళితపురదర్పుఁడై మహాదరముతోడ
- నబ్జశరపాలిఁ గని మౌళి నావహించు, ననిన నీశౌర్యసార మే మనఁగవచ్చు.149
క. దైవం బనిన న్నీవే, దైవము గా కింక నొకఁడు ధవళాక్షుల నా
- శీవిషవిశిఖశిఖార్తులఁ, గావింప న్వరులఁ గూర్పఁగా నెవ్వ డిఁకన్.150
సీ. వేఁడి యౌఁగదవయ్య విహితశైత్యాంధమంధరగంధవాహస్తనంధయంబు
- వాఁడి యౌఁగదనయ్య వనజాతిసహజాతిమార్దననవకౌసుమవ్రజంబు
- చేఁదుచూపుఁ గదయ్య జితసుధామాధురీసారకీరారావగౌరవంబు
- వింతసేయుఁ గదయ్య సంతతాత్యంతపోషితహంసకాంతానిషేవణంబు
- కామినీకాముకులకు యోగప్రసక్తి , దక్షమగు నీకటాక్షము దప్పెనేని
- గాన నిను గొల్చువారిదే కౌశలంబు, భవజయోన్నిద్రతారీణ పంచబాణ.151
సీ. వీటిఁబుచ్చవె దాసవిభుకన్యఁగను బరాశరమౌనివనరు సదాచారగరిమ
- బైట వైవవె బృహస్పతిభార్యఁ గనుఁగొన్న తారకాకామినీధవునిగుట్టు
- నగడు సేయవె యహల్యాకాంతఁ జూచిన యమరలోకాధినాయకుని నడత