ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ప్రథమాశ్వాసము
3
వ. అని యిష్టదేవతానమస్కారంబును సుకవిపురస్కారంబును గుకవితిరస్కారంబు
- నుం గావించి బహువిధకథావిచిత్రంబగు కువలయాశ్వచరిత్రంబను కావ్యంబు సరస
- జనసేవ్యంబుగా రచియింప నూహించి యేతత్కృతినాయకత్వంబునకుం దగువాఁ
- డెవ్వఁడో యని విచారించి.13
క. అలనారాయణధరణీ, తలనాయకమణికి నిచ్చెదఁ బ్రబంధంబున్
- గలదే మేదిని భేదము, తలఁపంగా నీతఁ డనఁగ దైవ మనంగన్.14
వ. అని నిశ్చయించియున్న సమయంబున.15
సీ. ఏనవ్యగుణహారి దానవారియవక్రచక్రసౌఖ్యకరప్రసక్తిఁ గాంచు
- నేవైరిహరహేతి భావరీతి యమూల్యకళ్యాణధరధర్మగరిమఁ గాంచు
- నేజగన్నుతిశాలి యాజికేళిఁ బ్రచంచపరచండమహతి యన్ ప్రౌఢిఁ గాంచు
- నేరమ్యతరకీర్తి మారమూర్తి యవేలకమలాంబికామోదఘటనఁ గాంచు
- నతఁడు వయిఖందుఖానసప్తాంగహరణ, కరణకారణరణరణద్ఘంటికాని
- కాయవేదండముఖసైన్యకలితవిజయ, శాలి నారాయణక్షమాపాలమాళి.16
వ. వెండియుఁ దాండవఖేలనోద్దండఖండపరశుజటామండలాగ్రహిండమానపుండరీక
- గంగాడిండీరపాంచరాఖండరుచికాండకీర్తినిష్యందచంద్రికాచక్రీకృతదుర్వక్రవిక్రమ
- పరిపంధిరాజన్యసైన్యుండును సర్వసర్వంసహాధూర్వహతానిరాకృతకమఠపరిబృఢకా
- కోదరలోకాధిపదిశాస్తంబేరమమూర్ధన్యుండును కరుణారవిందచరణామణీపరిణీ
- తపరీరంభణోజ్జృంభణాలోకుండును బ్రచండమండలాగ్రవిదార్యమాణరిపుమండలా
- ఖండలకరణీయభావిరంభాసంభోగాంతరాయభయావిలనలకూబరానీతనవనిధిబోధవి
- ధాయకనానావస్తువిస్తారనిస్తులస్తవనీయమణీరమణీయమందిరాలిందుండును రాజ
- కార్యవిరోధిరిపురాజశిరోధిఖండనోద్దండతదీయదుర్గగ్రహణవిచక్షణనిజనియు
- క్తసేనాభిరాముండును సింధుగోవిందధవళాంగభీముండును బ్రతిక్షణప్రకల్పితదా
- నధారాధునీమానావనోదనసాంత్వవాదనప్రవీణతదీయవేణికాసమాహతపారావారవి
- గళితనిజాశ్రయపరాయణతద్గాంభీర్యధుర్యుండును హేమకరగండాంకవర్యుండును
- శ్రీరంగరాజకుమారవీరవేంకటేశరాయ భుజాబలసహాయబహువిధోపాయధురీణుం
- డును జంచలలోచనామనోవంచనాపంచబాణుండును గాశ్యపగోత్రపవిత్రుండును
- జితచరిత్రుండును దిమ్మనరపాలగర్భరత్నాకరరాకాచంద్రుండునునగు నారాయణ
- ధరాదేవుం డొకానొకశుభవాసరంబున సుధాకరశిలావేదికాసరోవంబులకుఁ జెం
- దొగలపొందుఁ గలయ నొందించు నమందకుడ్యభాగపద్మరాగప్రతిబింబంబులకుఁ