ఈ పుట అచ్చుదిద్దబడ్డది
56
కువలయాశ్వచరిత్రము
- మ్ములపైఁ దేఁటులు వేఱుతామరలపై మూఁగం దదీయాళిరే
- ఖలు వాటిం గదుమంగఁ దధ్వనికి రేఁగం జక్కవ ల్దాఁటు ఱె
- క్కల లేఁదెమ్మెరపుప్పొడుల్ చదలనాఁగం జిత్రమయ్యె న్వడిన్.136
చ. చెలువ యొకర్తు క్రొందళుకుఁ జెందొవ బిట్టెగరంగవైవ న
- య్యలరు తదంజలిం బడుట యద్భుత మయ్యె మదీయపద్మరే
- ఖలఁ జెలరేగి గాసి యిడఁగాఁ దగునే యని యేగుదెంచి చే
- తులపయి వ్రాలి వేఁడికొను తోయజబాంధవబింబమో యనన్.137
గీ. సారకుచశైలమథితకాసారజలధి, నప్పుడప్పుడు వొడము నబ్జారికరణి
- నొకశుకాలాపమించి వెల్లకిల నీఁద, నమరె ముద్దులుగాఱు చిన్నారిమోము.138
చ. ఎలమినొకతులు వెల్లకిల నీఁదఁగఁ జుట్టును గల్యమొగ్గ ల
- గలముగ మించెఁ జన్నుఁగవకాంతులు గన్గొనవచ్చు నంబురా
- డ్జలరుహగంధి పంపఁ బరిచారిక లచ్చట ముద్దుగాఁగ పొం
- దులు గని వైచు గూటములతోడి కడానిగుడారము ల్బలెన్.139
గీ మొగము మాత్రంబు కానరా ముద్దుగుమ్మ
- యొకతె నిలువీతఁ యీఁదఁ జెన్నొందెఁ గురులు
- నీరజాకరమనెడు మున్నీటిలోఁ గృ
- పీటములు గ్రోలు మేఘంబుపిల్ల యనఁగ.140
క. బోరగిల నీఁదు నొక్కమి, టారి విశంకటకటీతటం బొప్పారెన్
- సారతరాపరపారా, వారావృతమైన భూమివలయం బనఁగన్.141
గీ. బాలికలు మేలి జీరుకురాలనుండి, నీటికై జారు సౌరు వర్ణింపఁదగియె
- నలమదాలసపై నదరంట నేయు, నలరువిలుకాని నునుదోనియమ్ము లనఁగ.142
సీ. చనుఁగవమీఁది చందనము చెందినచోటు వెలిదమ్మిపుప్పొడు ల్గలసికొనఁగ
- మెడల కుంకుమచర్చ మించి ముంచినచోటు చెంగల్పవిరిగుంపు చేరికొనఁగ
- సారమౌ నుదుటి కస్తూరి మీఱినచోటు తేఁటిలేజవరాండ్రు మాటికొనఁగఁ
- నెమ్మినిఁ బసుపువన్నియలు పన్నినచోటు నవకంపుటకరులు నాఁచికొనఁగఁ
- జెలువ లీరీతి నీరాడి కొలను వెడలి, తమముఖాంభోజముల నిండు తావి గ్రోలఁ
- దేనియలు గ్రాయు కక్కుర్తితేఁటు లనఁగ, జలజకణములఁ గీలుగంటలు సెలంగ.143
చ. తటమహిఁ జేరి యంతట మదాలసకుం గయిసేసి తాము ను
- త్కటమణిభూషణావళులు దాలిచి యేటిపరాకులమ్మయి