ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము
55
- డి యప్పటప్పటికి వికసితాంబుజంబులం గనుంగొని యవియు ముకులింపమిం బొం
- గు రథాంగకామినుల వినోదంబులకు ఖేదమోదంబు లనుభవించుచుఁ జెంగటఁ జె
- లగు చెంగలువమాలెపై నంకించిపాడు టెక్కుల తేఁటిజక్కులవారియాలాపంబుల
- లకుం బరిఫుల్లసరోజం బనుకామిల్లిచేరువఁ బరఁగు విగళితప్రసవపరాగపరంపర య
- నుపరికమ్రుగ్గుల డగ్గఱ నందం బగుమందమరుదాందోళితేందీవరముపైనుండి శివ
- మాడు సారసవరారోహలకు సమీపంబున శైవాలకలాపంబు లనుధూపంబు లర్పిం
- చుచు మూఁగికొని యాగామికార్యంబు లడుగు నమ్మలక్కలచందంబునం బొసంగు
- నానావిధజలవిహంగమాంగనావ్యూహంబున కుత్సాహంబుఁ బొందుచుఁ గమలాక
- రాభిధానంబుగానం గంకణవిరాజమానంబై పుష్కరస్వరూపంబు గావున రాజహం
- సకలాపంబై శోభితరంగవిశాలంబు గావున శైలూషప్రముఖానుకూలంబై సారం
- గవిలసితంబు గావునఁ బద్మకరేణుభూషితంబై యెసంగుటకు నంతరంగంబున నా
- నంద మందుచుం జేరి.131
సీ. వారు మీరును నొక్కవయసువారలు గాన నువిద వారికి మీకు సుద్ది యనుచు
- నోడినదానిపై నొడిసిన నేలిక సానిపాదములపై నాన యనుచు
- నాజతతోడ నేకాంతమాడితివి మాగుంపులో నీ వుండఁగూడ దనుచు
- నంటిమి గాక మర్యాదతో నిల్చునే యప్పటికైన యట్లగు నటంచు
- బాల యలనాఁడు నామీఁద నోలవెట్టి, తిచ్చ నిఁకమీఁదఁ జరియింపుమీ యటంచు
- నందు కేమాయెఁ గాని లేవమ్మ యనుచుఁ, బలికికొంచును దెగలుగాఁ బంచికొనుచు.132
మ. మెలఁతల్ తుమ్మెదకంటుకమ్మవిరిరుమ్మీపాదుషామామ మా
- టలతబ్బిబ్బుల కుల్కి కీలుజడఁ గొట్టం బూను జేజేలయొ
- జ్జలయిల్లాలని వ్రాసినట్టి వలువ ల్చాలించి యచ్చంపు ని
- చ్చలపుంజందురుకావి పావడలు మించన్ ఖేలనాలోలలై.133
గీ. డాసి దరి నిల్వ వారినీడలు పొసంగె, నీటిలోఁ దమ్మిమేడల నీటు రోసి
- తన్ముఖాంభోజముల నిల్వఁదలఁచి వచ్చు, పద్మ తాల్చిన విశ్వరూపము లనంగ.134
చ. సుదతులు బంతిగాఁ గొలనుఁ జొచ్చి చనంగఁ గ్రమక్రమంబునం
- బదములు ముంచి పెందొడలఁ బైకొని పొక్కిట నాఁగి చక్రసం
- పదలు సహింపలేని కుచభారము లోఁగొని కంఠదఘ్నమై
- తుది నటు మించదయ్యె నలతోయము కంబులు నాఁగమించుటన్.135
మ. కొల నయ్యింతులు సొచ్చినం దరగ సోఁకుల్ హెచ్చిన న్వీఁగుఁ ద