ఈ పుట అచ్చుదిద్దబడ్డది
54
కువలయాశ్వచరిత్రము
దానిలమత్తసిందురవిహారవిలోలతరంగజాలడో
- లానిశఖేలనాకలితహంసము నొక్కసరోవతంసమున్.130
వ. ఇత్తెఱంగునం గనుంగొని జలమానవకుమారు లెమ్మెలకై చిమ్ము క్రొమ్మెఱుంగుజము
- దాడులటెక్కునం దళుక్కున నెగురు నిడువాలువాలుగుపిల్లలకై నికటతటతరు
- పటలశాఖాశిఖానికరంబులనుండి దుముకు లకుముకులగరుత్తులం బెరుఁగు మరు
- త్తులం దొఱఁగు సరాగంబు లగు పరాగంబులం దగిలి యరవిందమందిరకుం దార్చినగం
- దవొడియఱపెట్టెలచందంబున నీషదుచ్చలితరథాంగంబు లగుతరంగంబులసందున న
- దభ్రవిభ్రమంబునం దిరుగుజలభ్రమంబులం దగిలి నిగనిగనికెంపురాలు నింపిన గో
- ముగను వామనగుంటలం దలపించుటకు శిరఃకంపనంబు సేయుచు జలబిందుసందో
- హకందలితచిత్రశతపత్రపత్రసమావేల్లితం బగుహల్లకంబు వారిదేవత కెత్తుమరకత
- పాత్రమౌక్తికారాత్రికంబుల డంబు విడంబింప నందులకు సోబనలువాఁడు ముత్తై
- దువుల చెలువున మ్రోయు తేఁటినీటుకత్తియల తేటపాటలకుం జొక్కెనో
- యన నాయకులతోడి పొలయలుకలం దొలంగి చని వనజకుడుంగంబులం గపటని
- ద్రాముద్రితలై చలితజలాంబులికలు సోఁకిన నులికిపడి యనునయింపం బతు లేతెం
- చి రని బయలుజంకించు నీటుకత్తియల తేటపాటలకుం జొక్కెనో బయలు జంకిం
- చు జక్కవమించుబోఁడుల యలక్ష్యబహుతరాక్షేపంబుల పెల్లునకుం గొల్లున నవ్వు
- చుఁ బువ్వింటిసాది మవ్వంపుననిగేరు మారుతమానవునకుం దీరసంచారిశిఖావళకుమా
- రికాకేకారావంబు లను గద్దింపులం జళుకు వొడమించి నడదిద్దు నెడం బర్విన రజం
- బువిధంబున దుమారంబుగా నుప్పరం బెగయు పుప్పొడిపేరింట నుల్లసిల్లు నుల్లడ
- నీడలవీడుజోడాడువేడుకలఁ గమలినీకమలబంధుపాణిగ్రహణంబునకుఁ గులదేవతల
- నెదురుకొనుచదురున లజ్జించుచు పుటసమంచితసకోరకబిసాగ్రపాలిక లగుచు వచ్చు
- మరాలికాబాలికలకలకలంబులకుం గ్రమ్మికొని తమ్మిమేడ లెక్కి పెక్కువగల ఱేకుచి
- క్కొమ్మలసందునం దొంగిచూచు మధుపానరోధవధూమణుల మిధస్సమ్మర్దకల
- కోలాహలబాహుళ్యంబులకుం దగవు లూహించుచు నాళీకముకుళంబులను కలశకు
- లంబులం బ్రతిష్ఠించి నిష్ఠాసంపదం గలహంసదంపతులు ప్రథమసమాగమంబునం బు
- ణ్యాహం బాచరించి యెదురుసూడం బొడసూపిన యజ్ఞాతప్రభాతం బగు నిశాస
- మయంబు విధంబుం దనరు పరిసరతరుచ్ఛాయామాయాంధకారంబునకుం దిగులువ