ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము
51
క. అని నన్నుఁ జూచి తలవాం, చిన డగ్గఱఁ జేఱి యే మొ చింతాసంతా
- పనిరూఢి జెందునందము, గనఁబడియెడు నిట్టు లౌనొ కాదొ యెఱుంగన్.106
చ. సరసిజగంధి నీమది విచారము దోఁపఁగ వేఱొకండు లే
- దరయఁగఁ గారణంబు నవయౌవనరూపకలావిలాసభా
- స్వరుఁడగునట్టి యొక్కమగవానిపయిం గనువైచి తేమొ దు
- ష్కరతరచింతచే నదియె కావలయుం దలపోసి చూచినన్.107
మ. బలభిన్నీలకచామణీ యిదియుఁ దప్పా కాంతులంగోరి కాం
- తలు చింతింప కంతుకుంతముల వంత ల్నింపరో లేక నీ
- తలనే పుట్టెనె యైన నేర మొకఁ డేతత్కార్య మాద్యంతముం
- దెలియం బల్కకయుంట నీవలన నింతీ యంతనే వింతటే.108
క. నావంటి బోఁటి గలుగం, గా వగవఁగ నేల యెంతకార్యం బైన
- న్నీవే కావలె నన్నం, దైవకటాక్షమునఁ గరగతము సేయ నటే.109
చ. అనవిని యాలతాంగి నగ వామతిల న్ననుఁ జూచి భావవే
- దినివి గదమ్మ నీకు నిఁకఁ దెల్పకయుండఁగ నేర్తునమ్మ నీ
- యనువు మదీయఘోరవిపదబ్ధికిఁ నోడ గదమ్మ వాఁడిమై
- నొనరినకంతుతూపులకు నోడఁగదమ్మ యిఁకన్ వధూమణీ.110
గీ. నాతి యెఱుఁగుదువా యల్లనాఁడు డేగఁ, జేత సహియించి చిన్నతేజీదువాలిఁ
- గాఁగఁ దోలుచు నీత్రోవగానె చనియె, నామనసు వానిమీఁదనె నాటెనమ్మ.111
చ. కలకల నవ్వుమోము పురిగల్గిననెమ్మెయి నూగునూగు మీ
- సలు నపరంజిడా లెగుబుజంబులు చక్కని ముక్కు తేటక
- న్నులు నిడుసోగకన్బొమలు నొక్కిన గ్రక్కునఁ బాలుగాఱు చె
- క్కులు నిసునుంతకౌను తళుకుందొడ లానృపమౌళికే తగున్.112
క. కనమో వినమో ఘనమో, ఘనమోహనమోదకారికచ మగవానిం
- దినముం భువనంబుల నా, మనము న్హరియించువాని మఱి గంటి మటే.113
గీ. వనజలోచన నేను గావలసినట్టి, దాననైతేని నెటులైన మాన వేంద్రుఁ
- గూర్చి నాప్రాణ మిపు డెత్తుకొమ్ము లేని, పక్షమైనను నామీఁదిబాళి విడుము.114
క. అని పలికి సొమ్మసిల్లినఁ, గని దీని మనంబు తెలిసెఁ గద యిఁకమీఁదన్
- మనసిజుఁ డదయుఁడు శరమే, సిన నేమగునో పరాకు సేయుదమనుచున్.115
గీ. ఎంతలే దింతి యిఁక లెమ్ము నంతయేల, యిందులకు నట్ల యొడఁగూర్చికొంద మబల