ఈ పుట అచ్చుదిద్దబడ్డది
50
కువలయాశ్వచరిత్రము
- ల్విడి వంచ న్రస మొల్కు లేఁజెఱకుమేల్వి ల్లెక్కుడించంగ న
- వ్వెడవిల్కానికి దూరదేశగమిథోవిశ్లిష్టమోహావల
- జ్జడిమాకంపితధైర్యదంపతిహరచ్చైత్రాదియాత్రారతిన్.97
క. ఆతఱిఁ దమి వెగ్గలమై, శాతోదరి పొగుల మిగుల జడిసి శరీర
- ద్యోతకము లైన చిన్నెల, చేత న్విరహ మని తెలిసి చెలువలు తమలోన్.98
సీ. ఆయెనమ్మ యిదేటి యాగడా లిది యేమి యెఱుఁగు నిన్నటినేఁటి మెెఱుఁగుఁబోఁడి
- యెఱుఁగునా యనఁగూడ దిప్పుడిప్పుడు కొంత గడిదేఱెలే వలకారివగల
- గడిదేఱ కింక నెన్నఁడు మంచిమగవానిఁ గోరించు జవ్వనం బూరఁజేయ
- జవ్వనం బౌనెకా చదువుకొన్నది గాన మనసు నిల్పఁగలేక మరులుకొనియెఁ
- జెలువ యీబాము లనుభవించినను గాని, తెలియదే ప్రేగులోపలి తీఁట వంటి
- వలపుకసికోఁత లివి పగవారి కైన, వలదుగా దీని కిపుడేల వచ్చెనమ్మ.99
చ. తడఁబడు మాట గద్గదిక దార్కొను నిల్చినచోట నిల్వరా
- దడుగులఁ దొట్రుపాటు గదియంబడుఁ గంపము చెందు నిద్ర రా
- దెడపని కోర్కి హెచ్చు మదినేమొ వితావిత జాలిజాలి యౌ
- నడిగినఁ జెప్పఁగూడ దకటా మరులెత్తిన యాఁటదానికిన్.100
క. ఇవి యన్నియుఁ జెలులారా, చివురాకుం బోఁడియందెఁ జెలువొందెడు ని
- క్కువ మింతకు విరహమహా, దవ మేకార్ణవము మీఁదఁ దగ వెయ్యదియో!101
మ. అతివా యింతకుమున్ను నన్బిలిచె డాయంబోయితిం బోయివ
- చ్చితివా యంచనె నేడ కంటి నదె రాజీవాక్షి యే లెస్స వేఁ
- డితిఁగా నిన్ననె నేటికే చెలువ యంటి న్నావెత ల్నీకు స
- మ్మతమా యన్న వితాకురాలయితి సమ్మా కొమ్మ యమ్మాటకున్.102
క. అని రట్టు సేయు బోఁటులఁ, గనుసన్నలఁ గడకుఁ బోవఁగాఁ బనిచి ననుం
- జనవిచ్చి మనుపుఁ గావున, నెనసినతమి వనితఁ జేరి యే నెయ్యమునన్.103
గీ. వచ్చి తడవాయెఁ గద మహీవలయమహిమఁ
- జూచిన ట్లాయెఁ గద యింక శోభనాంగి
- పోవలవదె మనపురంబునకు మగిడి
- తల్లిదండ్రులు కడుఁ దల్లడిల్లకుండ.104
క. తెలిసె నిఁకఁ కొన్నినా ళ్ళీ, యిఁలగల చెలువములు చూడ నిచటనె నిలువం
- దలఁచినకైవడి నున్నది, చెలువా యది లెస్స యట్ల చేయుద మేమీ?105