ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము
49
క. తమ కుపమేయస్థానము, కొమిరెల మృదుపాద మగుటకు న్వైవర్ణ్య
- క్రమ మొందిన సరణి రసా, లములుం గెందలికుటాకులం బస రెక్కెన్.88
గీ. వఱలె వనరాశిలోనఁ బ్రవాళపాణిఁ, గాంచి యీసునఁ బలెఁ బొడకట్టినట్టి
- ముత్తియపుగుంపులను దలంపులు జనింప, తారకతమోనివారకకోరకములు.89
క. మనలతకూనల మాధవుఁ, డనువుగఁ గూడె నని యుస్సు రను వనపద్మాం
- గనల ముకుళీకృతాస్యము, లన గాఁ దరులందు మొగ్గ లరవిరి యయ్యెన్.90
క. మనసిజుఁడు రోఁజుచుం ది, మ్మను తుమ్మెద నల్లప్రజలకై నానాపు
- ష్పనికరదళ నవ్యాజం, బున నత్తఱిఁ దేనెకణజము ల్దెఱపించెన్.91
గీ. లతలసౌమ్మైన కుసుమజాలంబు లొరయ, నకరువులపేరి యెమ్మెచ్చు పెకలిరాలఁ
- దొడిమలక్కలఁ బచ్చఱాతుటుము గాని, పించె ననఁ బసరుఁజాయల పిందె లమరె.92
గీ. మన్మథబ్రహ్మమునకు సమానదేవు, నొకని గల్పించి కైకొనరోయి యనుచు
- నలవసంతుఁడు గట్ట వ్రేలాడు పసుపుఁ, బూఁతజాలెలవలె ఫలంబులు సెలంగె.93
క. వ్రాలిన విరిజొంపముపై, రాలినపుప్పొడులు ప్రసవరస మనుముద్ర
- ల్గీలుకొనఁ బొలుచుచిలుకగు, ఱాలదునేదాని కొలుచురాసు లనంగన్.94
సీ. దాఁచఁబెట్టినవా సుధామాధురీధురీణమరందబృందసూనవ్రజములు
- కాణాచులా యనర్గళపచేళిమభిదేళిమచూతపోతావళీఫలములు
- సంతరించినవా విశాలమార్గననిర్దయోల్లూనకరుణార్హపల్లవమ్ము
- లప్పళించినవా వియద్ధరాపద్ధతిప్రారూఢసంచారిసౌరభములు
- దొమ్మిగాఁ దుమ్మెదలు మూఁగి తొక్కులాడు
- పొగరుతోఁ గీరములు చేరి జగడమాడు
- గొంటుగాఁ గోయిలలు రేఁగి కుమ్ములాడు
- మొనసి వలితెమ్మెరలు కెర్లి పెనఁగులాడు.95
సీ. చిలుక బాపనకొలంబుల బందుగులకెల్లఁ గలితామ్రఫలకోటి గ్రాస మొసఁగు
- నెలదేఁటి రాచగుంపుల చుట్టములకెల్లఁ బలుకుఁదేనియ పల్లెబట్ర లొసఁగుఁ
- జలిగాడ్పు కోమటి చాలు సజాతీయములకుఁ దావులసంచి మొద లొసంగుఁ
- గోయిల నాలనకొలముదాయాదుల కేలుకోఁ జిగురాకునేల యొసఁగు
- కొమ్మల నెలర్చు సాలజాలమ్ములోనఁ, జిలుకసాంబ్రాణితేజీవజీరుఁ డనుప
- దాణెమున్న వసంతుని రాణువెల్ల, గన్నుగుట్టెడు కడుపుంజి గనుటకతన.96
మ. ఎడలెం దత్తఱ చిల్కతేజిని జుమాయించంగఁ బల్మాఱు బ