ఈ పుట అచ్చుదిద్దబడ్డది
48
కువలయాశ్వచరిత్రము
- దలఁపుచు సిగ్గుతో మరుగునన్ నిలువంబడి వచ్చినాతఁ డా
- చెలువుఁడు చూడరే యనినఁ జెల్వలిఁ దెవ్వరిఁ గానమే యనం
- దలఁకుచుఁ జూచి కల్లయె యనంగడు వెల్వలఁబారు దీనయై.80
సీ. అధిపప్రతాపాగ్ని నరికట్టుకొన్నట్టి సొంపునం గనుఁదోయి కెంపుదనరఁ
- బతికీర్తి చంద్రకాపటలిఁ గౌగిటఁ జేర్చు మాట్కి మేనున బాండిమంబు వెలయ
- విభుదానధారాంబువితతికిఁ జోటిచ్చు పొలుపున శ్రమజలంబులు చెలంగ
- నాయకధైర్యంబు బాయకుండఁగబట్టుకైవడి నైశ్చలగరిమ మెరయఁ
- గడపట నిజేశు మదిలోనఁ గట్టివైచి, కొన్నగతి సంతతధ్యానగుణము దనర
- నమరియు నతండు గనిపించినట్టులైన, నదరిపడి లేచు ఱేలెల్ల నిదురలేక.81
సీ. తలచూప వెఱచు నీయళివేణి సమరందసుమబృందనవకాంచనములు గన్న
- పెదవెత్త వెఱచు నీబింబోష్ఠ తరువారసుకుమారతతధీరశుకము గన్న
- బొడఁగట్ట వెఱచు నీపువుఁబోడి ఝంకారభారాతిభయదషట్పదము గన్న
- నడుగిడ వెరచు నీయబ్జపాద సమీపవికటానుభావహంసికలఁ గన్న
- వెడవిలుతుచేతనగు నలజడియుఁ దేనె, జడియు గమ్మనిదెమ్మెరల్ తొడరుజడియు
- నలయు నెమ్మేనఁ జలువఁ చాకలపరించుఁ, గలవరించు నొకానొక కలవరించు.82
క. పొన్నలకుం దెలిజాబిలి, మిన్నలకుం దలఁకు చిలుక మేలిమిపలుకుల్
- విన్ననగున్ విన్ననగున్, గ్రొన్ననగుంపులకు దిగులుకొని మదిఁ బొగులున్.83
క. ఈరీతి నారికీరీ, శారీభారీకృతోక్తిచకితాత్మకయై
- పారరహితవిరహవశా, పారావారమున మునుఁగఁబడియున్నయెడన్.84
మ. తనరెన్ మన్మథజైత్రయానసుముహూర్తప్రక్రమం బేరుసే
- యనిశృంగారము భూరుహాళికి రతివ్యాలోలబాలామనో
- బ్జనవప్రేమల కుబ్బు మందలి వధూజలంబు పాలింటి పి
- ల్వనిపేరంటము వాసనాజనకమై వాసంతమాసం బిలన్.85
క. బెడగడరె లతావనితలు, నడతెంచు వసంతరాజునకు నడుగులకున్
- మడుగులు వఱచినకైవడి, నడరెడు తెమ్మెరలఁ బండుటాకులు రాలన్.86
చ. తనరస మెల్లఁ జూపవలదాయని వేళ యెఱింగి యత్తరిన్
- గనఁబడు మన్మథాగ్నిమొలకల్ వలె మోసులుగా జనించి యా
- నుని పథికాంగనాపురుషమండలి డెందములొందఁ బంచివే
- సినతి రెండు గాగ విరిసెం దలిరాకు వనాంగణంబులన్.87