ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము
47
- బార్వతిచే నర్ధపద్మారిమౌళికి నిట్టట్టుఁ బీరంబు లెత్తఁ బాసె
- కమలచే నీలమేఘశ్యామమూర్తికి గరుడు నెక్కి వయాళి గనఁగఁ బాసె
- నెందు సర్వసుపర్వపర్వేందుముఖుల, చేత నిశ్శేషదేవతాశ్రేణికెల్ల
- సదనకోటులలోఁ గట్టు గదలఁ బాసె, ననఘ మానాతి జూతురో యనుభయమున.72
ఉ. ఆవెత లెన్నియైనఁ గలవయ్య మహాత్మ వచింప భారతం
- బీవనజాక్షి మెచ్చఁ జన దెవ్వరి నెట్టి మహానుభావుతే
- జోవిభవంబు దెల్పినను జుక్కను నెవ్వరి రూపమెంచినం
- దా విననట్ల పోవు నొకతప్పు పనుల్ గదియించి యవ్వలన్.73
గీ. అంత నొకనాఁడు తలితండ్రు, లనుప భూమిఁ గలవిశేషంబు లీక్షింపఁదలఁచి యేను
- లోనుగాగల నెచ్చలుల్ వేనవేలు, గొలువ నిగ్గజయాన యియ్యలకు డిగ్గి.74
క. ఇందుఁగల పుణ్యభూముల, నందందుఁ జరించి కోకిలాళిమదాళీ
- కందళితకేళిపాళిన్, నందనముం గేరు నొకవనంబున విడిసెన్.75
చ. విడిసినయంత నొక్కదొర వేఁటకు వచ్చెనొ కాని కొంచెపు
- న్నడ గని నెక్కిచేతను గ నంబడు నెట్టెముమీఁది డేగయున్
- బడలినమోము గువ్వగుమిపట్టుల బాఱెడుచూపు మించఁగా
- దొడిఁదొడి నూడిగంపుఁ దెగతోఁ జనియెన్ మముఁ జూడఁడేమియున్.76
గీ. అతనిఁ గనుగొన్న నేకన్నెయైన వలచు, నమ్మహారాజు దురగవేగాతిశయము
- నంది చనలేక యంతంత నరుగువారి, నడుగ వారు ఋతధ్వజుం డనుచుఁ జనిరి.77
గీ. అతనిఁ జూచినదఁట యీసుధాంశువదన, యదియ నెపముగ రతిదేవి యాకుమడచి
- నోటి కందియ్య వగకోటి నూటికోటి, యేసె నేర్చి మనోజాతుఁ డింతిమీఁద.78
చ. అదిమొద లీవధూటి విరులంటదు కస్తురి గీరుబొట్టు పె
- ట్టదు పువుఁదోట రాయదు పటంబులు వ్రాయదు వీణచెంతఁ జే
- రదు నెవరైన చిల్కను కరంబున దాలిచి ముద్దటంచుఁ దా
- గదియదు కంజకాండకరకార్ముకకర్మహతాహతాంగియై.79
చ. చెలుల మొరంగి నిల్చి తనసిబ్బెపుగుబ్బలు నారుతీరు ని
- గ్గులుగల కేలుఁదమ్మి కనుఁగొంచు నయో యిటువంటి మేనికిన్
- వలదె తదీయచారుతరవక్షమునం బువుదండఁ బోలె నీ
- యలసత దీక నిద్రఁగననంచుఁ దలంచి వితాకురాలగున్.80
చ. ఎలమి నరేంద్రమౌళి తనయింటికి వచ్చినయట్లుగా మదిం