ఈ పుట అచ్చుదిద్దబడ్డది
2
కువలయాశ్వచరిత్రము
- శ్రేణు ల్మించుగ గానర క్తిఁ జిగిరించెం బూచెనంచు న్మదిం
- గాణ ల్మెచ్చఁగఁ బాటపాడి పతికి న్సంతోషముం గూర్చునా
- వాణీనీరజనేత్ర నారనధరావజ్రిం గృపం బ్రోవుతన్.6
మ. కలుగు న్లాయపుతేజికిం భయముమైఁ గాన్పించు నీశానుసొ
- మ్ములకుం దమ్ముని కత్తలానము రయంబు ల్మీర రావించి సూ
- రెలకుం బర్వునఁ బోవువానిఁ గని గౌరీకాంత సారెం గిలా
- కిల నవ్వ న్ముద మొందు దంతిముఖునిం గీర్తించి నర్తించెదన్.7
సీ. అలకురువ్రజనాథు నడఁగఁదొక్కు నటంచు నలకురువ్రజనాథు నడఁగఁద్రొక్కె
- సైంధవాక్రమణ నైశ్చల్య మొందు నటంచు సైంధవాక్రమణ నైశ్చల్య మొందె
- మించి యక్షబలం బడంచి పేర్చు నటంచు మించి యక్షబలం బడంచి పేర్చె
- ద్రోణగురుత్వంబు తొడరితాల్చునటంచు ద్రోణగురుత్వంబు తొడరితాల్చె
- భావిసోదరభీమసంభావ్యకార్య, మెల్ల నీరీతి నెఱిఁగించె నెవ్వఁ డట్టి
- రామపాదారవిందమరందబృంద, చంచరీకాత్ము హనుమంతు సన్నుతింతు.8
సీ. ప్రతివాదిమర్మనిర్మథనకర్మఠమైన బాణసౌశీల్యంబుఁ బ్రస్తుతించి
- ఘనశబ్దసాంగత్యజనితాత్యధికమోదగరిమఁ గన్న మయూరసరణి నెన్ని
- మాలతీమాధవమహిమఁ బూజితమైన భవభూతిమార్గంబుఁ బరిగణించి
- సారనవార్థపోషణధురీణంబైన భారవి యుదితవిభ్రమముఁ బొగడి
- వెండియును గాళిదాసాదివిబుధవరులఁ, దలఁచి యుష్మత్కవిత్వసందర్భగౌరళ
- వార్థ్యహంఖలు దాతుమర్హథ యటంచు, వారికృపఁ గాంతుఁ గవితాదివైభవంబు.9
క. నన్నయభట్టన్నను నె, ఱ్ఱన్నను దిక్కన్నసోమయాజిని శ్రీనా
- థు న్నాచనసోముని మది, నెన్నుదు నాంధ్రప్రబంధహేలానిధులన్.10
శా. విగ్రస్రగ్నవగంధమంధకపురోవీథీవధూక్రీడ పం
- గుగ్రామణ్యతిదూరసంస్థితసురక్షోణీధరేంద్రంబు వృ
- ద్ధాగ్రశ్యామ గదా మదాచరితకావ్యం బౌర దుర్వైదుషీ
- వ్యగ్రాసత్కవికోటి యెన్న నది యూహ ల్సేయఁగా నేర్చునే.11
మ. ఒకచో శబ్దంగుంభనంబు లొకచో యుక్తిక్రియాగౌరవం
- బొకచో నద్భుతజాతివార్త లొకచో నుజ్జృంభితత్తద్రస
- ప్రకరంబుం గనిపించిన న్మదికి సంభావింప నర్హంబుగా
- కకటా యేమియు లేని కబ్బ మది యాహ్లాదంబు గావించునే.12