ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము
43
- కెన నెఱిచూపు నెవ్వరు నగించని నవ్వు బయల్ గుఱించి ప
- ల్కును గళ దేరు మేనుఁ గనుఁగొన్నను జక్కెరబొమ్మయొక్క చ
- క్కనిమొగవానికి న్వలచెఁ గావలయుం గలయం దలంపఁగన్.35
క. బలవంతపు వలవంతలఁ, జెలువంతయు నేరి సొమ్ముఁ జేసెనొకో యీ
- వలపునఁ దగిలినవానికి, దలపున లవలేశమైన దయ లేదేమో.36
ఉ. వానిది గాక జన్మమనువారము నీరమణీలలాల య
- య్యో నగుబాటుగా నతనియొద్దకు నెచ్చెలిఁ బంచి పంచినం
- దా నిటు రాక వేఱిమి యొనర్చునొ నావలపంచు నించువి
- ల్కానికి లొంగి నెమ్మదిఁ దలంచుకొనన్ వలపించె నెవ్వఁడో.37
క. అవ్వల నొకనికి మీఁదుగ, జన్వన మిటు గట్టియున్న జలజేక్షణతో
- నెవ్వగఁ పలుకులు పలికిన, నెవ్వగయే కాని చేరనేరవు కోర్కుల్.38
గీ. ఐన నేమగు దీనివృత్తాంత మెల్ల, దెలియవచ్చుగదా యంచుఁ దొలఁగి యొక్క
- లోవమఱుఁగున నిలువ నాలోలనయన, జేరి నెచ్చెలిహారాళిఁ జిక్కుఁ దీర్చి.39
మ. తలివండ్రుల్ మన మీనిశాచరునిచేతం జిక్కి దిక్కేది యీ
- యిలఁ గాసిల్లుట గానకేమయిరొ వారేమైనఁ గానిమ్ము నీ
- యెలప్రాయంబు నిరూఢి కాసపడి వీఁ డేమేమి గావింప వ
- ర్తిలుచున్నాడొ యెఱుంగ మిందులకె యింతీ వంత లేదాయెనే.40
క. అక్క ఋతధ్వజభూవరుఁ డెక్కడ నీ వెక్కడే యి యేమిటికే నీ
- చొక్కపుఁ జక్కనినెమ్మే, నిక్కాఱియ కోర్వనేరదే వగ యేలే.41
చ. తలపున నెంతి మోహపరితాపము గల్గిన దాచుకొందురో
- యలయక లేక యీకరణి నంగడి వెట్టిదురో వధూటులౌ
- పలుకవు నిన్నువంటి కులభామలఁ గానవొ వారి కాత్మ నా
- థులపయి బాళి లేదొ తమిబుట్టిన పట్టున మట్టుపెట్టరో.42
క. తగు లెఱుఁగఁజేసి కూడఁగ, మగవానికిఁ జెల్లుఁ గాని మఱి యెంతైనన్
- మగువకుఁ జెల్లదు మీఁదట, నగుబాటగుఁ బిన్నపను లనన్ రాదు చెలీ.43
ఉ. నీమది నింతకోరిక జనించినయప్పుడు యెట్లు కూర్చునో
- యామరుఁ డింక నిన్ను వసుధాధిపమౌళికఁ గూర్చకుండ నే
- మీమనమంతగా రిపులమే మఱి వానికిఁ దానఁగీర్తి గా
- దే మరియాద తప్పిన సతీ విను మొక్కటి సావధానవై.44