ఈ పుట అచ్చుదిద్దబడ్డది
42
కువలయాశ్వచరిత్రము
సీ. పలచనిపావడపై నొంటికట్టుగాఁ గట్టిన వలిపె చెంగావికడమ
- పాన్పుపైఁ బొరల నిబ్బరపు గుబ్బలహారపటలి పెటిల్లునఁ జిటిలి రాల
- కెరలు నిట్టూర్పులఁ గెమ్మోవి బగులంగ గోరునఁ జిమ్ము కన్నీరు వడిన
- బంగారుగోడ కరంగిపోవఁ దలాట బటువు లల్లంతటఁ బడఁగనేమొ
- పనికి దిగ్గున లేచి పూపాన్పుమీఁద, వ్రాలి కూర్చుండి ముక్కుపై వ్రేలు నిలపి
- యొక్కచెలికత్తె యూరార్పఁ బెక్కుతలఁపు, లన్నుకొననున్న యొకవన్నెలాడిఁ గాంచి.27
మ. భళిరా కన్నులు మీలఁ కీసొగసు రూపా చాల సేబాసురా
- కళలందించ్చు మెఱుంగు ముద్దుమొగ మింకం జంద్రుఁడా దీనిముం
- గళ నౌరా బలితంపుగుబ్బ లివియే కాబోలుఁ బూచెండ్లమిం
- డలు మేలే కురు లింద్రనీలములకన్నన్ మిన్న లౌనే కదా.28
క. నెమ్మి గదా నడతుమ్మెద, దొమ్మి గదా బెడఁగుగురులు తొలుకరి మించుం
- గమ్మి గదా మెయి మరు దో, దుమ్మి గదా తగినచూపు తొయ్యలికి భళీ.29
ఉ. దబ్బరకౌను మాట వనితామణి కౌను మెఱుంగు జాళువా
- గుబ్బలి ఱేని కోటవలి గుబ్బెత చన్గవ వేల్పురాచరా
- ద్రబ్బల మేలితేట యలరాజముఖీమణి వేణికారుచుల్
- లిబ్బిపడంతి పట్టి కనలీల జయంబగు దీని ప్రాపునన్.30
చ. కలకల నవ్వు వట్రున మొగంబు చరాలను చారెడేసి క
- న్నులు పిడికింటిలో మిను మినుక్కను కౌనును ముద్దుగారు ప
- ల్కులుఁ జెవికమ్మచేఁ దళుతళుక్కను చెక్కులుఁ పట్టెడేసి గు
- బ్బలుఁ గనుచూపుమేరకు గుభాలను తావులు దీనికే తగున్.31
ఉ. జక్కవపిట్టకున్ గలికి చన్నులమిట్టకు నేమి పుట్టువో
- చక్కెరదీవికిన్ వనిత సన్నపుమోవికి నేమి వావియో
- నిక్కువచానికిం జెలున నిద్దఁపుమేనికి నేమి నేస్తమో
- చుక్కలకోటికి న్మగువసొంపులగోటికి నేమి కూర్మియో.32
క. అని యెంచి యంచువిలువీ, రుని యలుఁగులగుంపు మది చురుక్కున నాటన్
- జనియించిన తమకము ర, క్కొనిముంచినఁ గఱఁగి తెచ్చికొల్ ధృతిమించన్.33
క. ఎంత కడంగి నుతించిన, నంతకుఁ దగునేకదా మదాళి నవాళీ
- కుంతలకాంతవసుమనః, కుంతలసదపాంగ కంది కుండెడిదేమో.34
చ. కనుగవకెంపు కొప్పు విడఁగా ముడిగొల్పెడు బొందిమీఁది జం