ఈ పుట అచ్చుదిద్దబడ్డది
తృతీయాశ్వాసము
41
- లెదుటి సురంగంబు లెఱిఁగి యా చాయఁగాఁ గల్పించు ప్రతిసురంగముల గములు
- ప్రతిబలము వ్రేయు తిరుగుడుఱాళ్లకతనఁ, గుమ్ము లానిన బంగారుగోడ లురలి
- పడిన మగరాలు చూర్ణమై పుడమి రాలు, నీలములచాలుఁ జూచి వర్ణించుకొనుచు.18
క. ఘోరదశాధారనిశా, చారికృశాంగులను జూచి జడియకుఁ డనుచున్
- సారతరదాతృమహిమం, బూర ధరాజాని యభయ మొసఁగుచు నంతన్.19
సీ. కోటవెట్టికి ముద్దుగుమ్మలతో మట్టితట్ట లందిచ్చు గంధర్వచయముఁ
- గనునీళ్లు పులిమికొంచును బానశాలలో మంచు గట్టించు నమర్త్యకులము
- మలఁగికొంచును ఫిరంగుల లగ్గములమీది కురువడితోఁ జేర్చు నురగగణము
- బలిమికాండ్రగు రక్కసులకు సంకెళ్లతో జలకుంభములు మోచుసాధ్యపటలి
- విబుధరిపు పాటుఁ జెప్పుకో వెఱచి ముత్తి, యపుహజారాన గుసగుసలాడుచున్న
- కిన్నరశతంబుఁ గని బుజ్జగించి పనిచి, ననుచు వేడుక తోడుగా నగరు దరిసి.20
సీ. నలఁగిన మైలచీరలకు మైఁ బొంగారునిగ్గులు బంగారునీరు గాఁగ
- ముడి వీడు నిడుచక్రొమ్ముడులడాలు శరీర నకు నల్లనిమేలిముసుఁగు గాఁగఁ
- బవళించు కఠినభూభాగమ్ముమీఁద నిబ్బరపుఁజూపులు కల్వపాన్పు గాఁగ
- నాఁకటి కన్యోన్య మలసత మై నాడుమాటలె యమృతెపుతేట గాఁగ
- దనుజు చెఱసాల నున్న గంధర్వకాంత, లదరిపాటునఁ దనుఁజూచి బెదరి లేచి
- కొంకుసిగ్గులతో మఱుంగులకుఁ బోవ, నిలచి వారలఁ జేర్చి మన్నించి పనిచి.21
క. తోవరాచరాతినిధ్దపుఁ, జవికేల తెగల న్నగళ్ల చావళ్లను నుం
- బవడఁపుఁగొణిగెలలోగిలి, సవరనికేరులును దాఁటి చనఁ జన నెదుటన్.22
గీ. పచ్చి దేరఁగఁ జిలుక బాబా వజీరు, జగడమునఁ గుమ్ములాడు నచ్చరమిటారి
- కత్తెయలవేల్పు నెఱనీటుకాండ్రరూప, ముండు బొమ్మలుగల మేడయొకటి గాంచి.23
క. తగురా మగరానిగనిగ, లగురా తొగరాచసాలల న్విన్ననువుం
- బిగడాలడా లిదెంతటి, సొగసని తేజీని డిగ్గి చోద్యం బలరన్.24
మ. చనుచో నాతని కందుఁ గర్ణపదవిశ్రాంతంబు లయ్యెం గడున్
- వనితా యెంతటి బేలవే నెలఁత యైనం జింతనే చింత గుం
- దువటే యందనిమ్రానిపండులకుఁ జేతుల్ చాతురే యైన న
- ద్దనుజోదంత మెఱుంగు నంతకును గాంతా తాళుమ న్వాక్యముల్.25
క. అది విని మఱియున్ వినివిని, యిదియేమో కాని చూత మిపుడని యవనీ
- ధవనేత బూరికోరిక, నవలికి జని జనితవిస్మయనిమగ్నుండై.26