ఈ పుట అచ్చుదిద్దబడ్డది
40
కువలయాశ్వచరిత్రము
సీ. అచ్చరచెలువ లుయ్యాలచేరులు నేలవైచితి రని తోడివారిఁ బదరఁ
- జో టించుకయు లేక కోటకంబులలోని యిరవుపాములు పెఱ బొఱియఁ జొరఁగ
- నఖిలపక్షులకులాయములుఁ బోఁ బిల్లల గఱచి యవ్వలికోనకడకుఁ బఱవ
- ముంచి చీఁకటులు కల్పించు నీడలు పోవఁ బద్మాకరంబుల పాఁచి విఱుగఁ
- జెట్టుగులులేని పెనుగారుచిచ్చు వచ్చె, ననుచుఁ జెంచెత లెండకై యలమటింపఁ
- బార్థివేంద్రుని భటులు డాబాలు నడుప, నఱకి రయ్యద్రిపై విపినంబునెల్ల.10
క. దనుజుల తుపాకిగుండు, ల్గనఁబడు డాబాలు పలకలం దాఁకి బిరీ
- లునఁ దిరుగుఁ దము నియోగిం, చినవారల నొంచ మగుడు చెలువం బమరన్.11
క. మనుజేంద్రుఁ డంత సేనలఁ, బనుపుచు సురతాణి లగ్గఁబట్టించిన న
- ద్డనుజపతి వీరధర్మం, బునఁ దెగువకుఁ జొచ్చి యెదుర ముదిరిన కినుకన్.12
మ. అరరే వేఁడిమెఱుంగుతూపుఁ గొని యయ్యా యెంతయో వింత యా
- నరనాథాగ్రణి యేయఁగా నది దిశాంతభ్రాంతరోచిర్నిరం
- తరమై వానిశిరంబు గైకొని యనంతాకాంతపైఁ దార్చె దం
- తురసంతోషహృదంతులై ధిగధికాంతు ల్చెంత చింత ల్విడన్.13
ఉ. అంతటఁ జేరవచ్చిన వియచ్చరనాథుల దీవన ల్మహీ
- కాంతుఁడు గాంచి వారి మృదుగౌరవసారవచోవిభూతి న
- త్యంతము సంతసం బొదవ నన్చు నిజాంచితసైన్యము న్బహిః
- ప్రాంతమునందు నుంచి దరహాసవిలాసవిభాసమానుఁడై.14
క. నగరిపురిపునగరుం ద, న్నగరీరథయూధసౌధనానావిధరు
- గ్ధగధగలు చూచువేడుక, చిగిరింపఁ గురింపరాని చిడిముడి వొడమన్.15
క. ఒక్కఁడె పవనోద్భవజన, ధిక్కరణధురీణ మైన తేజి న్వడిగా
- నెక్కి ప్రకాశాత్యవశద, దిక్కంబగు పురము సొచ్చి ధృతి నచ్చోటన్.16
ఉ. గోడలు గోష్ఠము ల్గరిడి గుళ్లు గృహాంగణము ల్గజస్థలు
- ల్మేడలు మేలుకట్టులును మిద్దెలు ప్రాకలు మేలుమచ్చులున్
- వాడలు వేదులు న్విపణివర్గములు న్వనజాకరంబులుం
- జూడఁ బదాఱువన్నె గల శుద్ధసువర్ణము లౌట మెచ్చుచున్.17
సీ. పరఁగఁ బిరంగీల బలుగుండ్లకై డాఁగఁ బలుక లమర్చిన పాఁతరలును
- వెలుపటి మంచుతిత్తులు గూలిన యరాబు కొఱకమర్చిన పచ్చిగోడగుంపు
- లెనసి మార్తురు లగ్గకెక్కకుండంగఁ దార్చిన కాంచనంపుచందనపుఁజేతు